ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలి రైతు అయ్యాడు.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు..

Agriculture News: ప్రస్తుతం ఉపాధికి వ్యవసాయమే ఉత్తమ ఎంపిక. ఇప్పుడు యువత కూడా అధిక సంఖ్యలో వ్యవసాయం వైపు వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి

ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలి రైతు అయ్యాడు.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు..
Engineer Job
Follow us

|

Updated on: Nov 21, 2021 | 6:02 AM

Agriculture News: ప్రస్తుతం ఉపాధికి వ్యవసాయమే ఉత్తమ ఎంపిక. ఇప్పుడు యువత కూడా అధిక సంఖ్యలో వ్యవసాయం వైపు వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాకు చెందిన సత్యేంద్ర సింగ్ కూడా అలాంటి రైతుల్లో ఒకరు. ఇటలీ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. అతని పోస్టింగ్ ఇరాక్‌లో ఉండేది. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి వచ్చారు. చాలా కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చినా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. స్వగ్రామానికి వచ్చి అధునాతన సాంకేతికతతో వ్యవసాయం చేస్తున్నారు.

ఇరాక్‌లో ఉన్న సమయంలో అతను యూట్యూబ్‌లో అధునాతన వ్యవసాయం గురించి సమాచారం సేకరించారు. ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం ప్రారంభించారు. జలౌన్‌లో ఉన్న తన భూమిలో పసుపు, అల్లం సాగు చేసిన మొదటి రైతు సత్యేంద్ర సింగ్. ఎందుకంటే ఈ ప్రాంతంలో పసుపు, అల్లం సాగు చేసేవారు లేరు. రెండింటిలోనూ మంచి దిగుబడి సాధించారు. దీని తర్వాత అదే పొలంలో సీతాఫలం, పుచ్చకాయ సాగు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో కొత్తిమీర పండించారు. ఏడు నుంచి ఎనిమిది టన్నుల కొత్తిమీర ఉత్పత్తి చేశారు. స్థానిక రైతులను వ్యవసాయం చేసేలా ప్రోత్సహించడమే తన ముఖ్య ఉద్దేశమని సత్యేంద్ర సింగ్ చెప్పారు.

ప్రజలు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాలన్నారు. సాధారణంగా ఏమి చేయలేనివారు వ్యవసాయం చేస్తారనేది సాధారణ నమ్మకం. కానీ వ్యవసాయం అనేది ఒక కళ లాంటిదే. అందరు దీనిని చేయలేరని చెప్పారు. వ్యవసాయం కోసం మినీ ట్రాక్టర్‌ తీసుకున్నట్లు తెలిపారు. అతని ఇంట్లో ఇప్పటికే ట్రాక్టర్ ఉన్నప్పటికీ, మల్టీక్రాపింగ్ చేయడంలో మినీ ట్రాక్టర్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. దీంతో పాటు సమీపంలోని రైతులు కూడా మినీ ట్రాక్టర్లు ఉపయోగించేలా ప్రోత్సహించారు. సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

తల్లిదండ్రులకు గమనిక..! పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యాధికి గురైనట్లే..?