AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Camphor Plant: ఇంట్లోనే కర్పూరం మొక్కను పెంచుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!

కర్పూరం.. ప్రతి పూజా మందిరంలో తప్పక ఉంటుంది. పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటి ప్రతి పండగ, ఇంట్లో రోజూ ఇచ్చే హారతిలో కర్పూరం తప్పనిసరిగా వెలిగిస్తుంటారు. ఇది ఇంట్లో సువాసనతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని చెబుతారు. మరి అలాంటి కర్పూరం మొక్కను ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చునని మీకు తెలుసా..? అదేలాగో వివరంగా తెలుసుకుందాం.

Camphor Plant: ఇంట్లోనే కర్పూరం మొక్కను పెంచుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!
Camphor Plant
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2026 | 8:14 AM

Share

గార్డెన్‌ లవర్స్‌ చాలా మంది ఉంటారు. ప్రస్తుతం ఇది ట్రెండ్‌గా కూడా మారింది. చిన్న స్థలంలో కూడా వివిధ రకాల మొక్కల్ని పెంచుతూ ఇంటి అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతున్నారు. అయితే, కర్పూరం మొక్కను కూడా ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చునని తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే..కర్పూరం మొక్క నుండి వెలువడే సువాసన ప్రతికూల శక్తులను (Negative Energy) తొలగించి, ఇంట్లో సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. ఆధ్యాత్మికంగా ఇది లక్ష్మీదేవి, హనుమంతుడి అనుగ్రహాన్ని అందజేస్తుందని భక్తుల నమ్మకం. ఆరోగ్య పరంగా కూడా ఈ మొక్క ఆకులు గాలిని శుద్ధి చేయడంలో, దోమలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మనం పూజల్లో వాడే కర్పూరం ఈ మొక్క ఆకుల నుండే తయారవుతుంది.

కర్పూరం మొక్కను ఇంట్లో పెంచాలని నిర్ణయించుకున్నప్పుడు మనం చేసే మొదటి, ముఖ్యమైన పని కుండీని సిద్ధం చేయడం. చాలామంది ఏదో ఒక మట్టిలో మొక్కను నాటేస్తుంటారు. కానీ కర్పూరం మొక్కకు ఒక ప్రత్యేకమైన మట్టి మిశ్రమం అవసరం. కర్పూరం మొక్క పెరగడానికి కొంచెం ఎక్కువ స్థలం అవసరం. మీరు కుండీలో పెంచాలనుకుంటే కనీసం 12-14 అంగుళాల వెడల్పు ఉన్న కుండీని ఎంచుకోవాలి. మట్టిలో ఇసుక, కంపోస్ట్ కలిపి వాడితే నీరు నిల్వ ఉండకుండా ఉంటుంది.

విత్తనాలను నాటే ముందు 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. నర్సరీ నుండి తెచ్చిన చిన్న మొక్కను నాటడం మరింత సులభం. వర్షాకాలం లేదా శీతాకాలం ప్రారంభంలో నాటడం వల్ల మొక్కగా త్వరగా ఏనుకుంటుంది. ఈ మొక్కకు రోజుకు కనీసం 5-6 గంటల ఎండ అవసరం. వేసవిలో మట్టి ఆరిపోయినట్లు అనిపిస్తేనే నీరు పోయాలి. అతిగా నీరు పోయడం వల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. మొక్క ఏపుగా పెరగడానికి నెలకు ఒకసారి సేంద్రియ ఎరువులు వేయాలి.

ఇవి కూడా చదవండి

మొక్క ఎనుకుని బాగా పెరుగుతున్న కొమ్మలను అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉండటం వల్ల మొక్క గుబురుగా తయారవుతుంది. తెగుళ్లు రాకుండా ఉండటానికి పదిహేను రోజులకోసారి వేప నూనె మిశ్రమాన్ని స్ప్రే చేయాలి. కర్పూరం ఆకులు గాలిలోని బ్యాక్టీరియాను చంపుతాయి. ఈ మొక్క ఉన్న చోట దోమల బెడద తక్కువగా ఉంటుంది. దీని ఆకుల నుండి వచ్చే నూనెను కీళ్ల నొప్పుల నివారణకు కూడా వాడుతుంటారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..