AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెల్లుల్లి గురించి మీకు తెలియని హెల్త్‌ సీక్రెట్స్‌ ఇవి..! తప్పక తెలుసుకోండి..

తలనొప్పి, క్రిమికీటకాల కాట్లు, నెలసరి నొప్పులు, పేగులలో పురుగులు, గడ్డలు, కణుతులు, హృదయ సంబంధిత వ్యాధులకు వెల్లుల్లి ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లి ధమనులు పూడుకుపోవడం, గట్టి పడటం వంటి వ్యాధులను నిరోధించడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించగలదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులతో పాటు వైద్యులు సైతం వెల్లడించారు.

వెల్లుల్లి గురించి మీకు తెలియని హెల్త్‌ సీక్రెట్స్‌ ఇవి..! తప్పక తెలుసుకోండి..
Garlics
Jyothi Gadda
|

Updated on: May 26, 2025 | 1:58 PM

Share

ప్రకృతిలో అత్యంత సహజ సిద్ధమైన యాంటి బయాటిక్‌ వెల్లుల్లి గురించి ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటంటే.. వెల్లుల్లికి ప్రాచీన కాలం నుంచి అన్ని దేశాల చికిత్సలు, వైద్య విధానాల్లో, ఆధునిక ప్రపంచపు వైద్యంలో కూడా ఘనమైన స్థానం ఉంది. వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయనే విషయంలో ప్రపంచ దేశాల్లోని వైద్య విధానాల్లో ఏకాభిప్రాయం ఉంది. వెల్లుల్లి మధ్యధరా సముద్ర ప్రాంతంలో పుట్టినట్టు భావిస్తారు. వీటి అవశేషాలు ఈజిప్షియన్ పిరమిడ్లలో సైతం గుర్తించారు పరిశోధకులు.

క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితమే వైద్యంలో వెల్లుల్లిని వాడినట్టు సుమేరియాలో దొరికిన మట్టి బిళ్లలపై గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈజిప్షియన్ల కాలంలో వెల్లుల్లిని అధికంగా వినియోగించే వారు. ఈ కారణంగానే గ్రీకు రచనల్లో ఈజిప్షియన్లను కంపు మనుషులుగా వర్ణించే వారని పరిశోధకులు చెబుతున్నారు. భారతీయ వేదాలలో వెల్లుల్లి ప్రస్తావన పెద్దగా కనిపించదు. మూలికల ప్రస్థానం ఉండే వేదాలలో దీని ప్రస్తావన లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి భారత్‌లోకి ప్రవేశించి ఉంటుందని అంచనా వేస్తున్నారు పరిశోధకులు.

చరక సంహితలో చర్మ రోగాలకు, వాతాలకు, అంటు వ్యాధులకు, లైంగిక సామర్ధ్యాన్ని పెంచే గుణం వెల్లుల్లిలో ఉన్నట్టు పేర్కొన్నారు. చంద్ర గుప్త మౌర్యుడి కాలంలో గ్రీకు దేశంతో ఏర్పడిన వ్యాపార సంబంధాలతో దేశంలోకి వెల్లుల్లి ప్రవేశించి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో రచించిన సుశ్రుత సంహితలో వెల్లుల్లి అజీర్తికి, హృదయ సంబంధిత వ్యాధులకు, జీర్ణ వాహిక వ్యాధులకు, మలబద్దకానికి ఔషధంగా సిఫార్సు చేశారు.

ఇవి కూడా చదవండి

క్రీస్తు శకం ఏడో శతాబ్దంలోనూ వెల్లుల్లి ఆకలిని పెంచుతున్నట్టు, విరిగిన ఎముకల్ని అతికిస్తుందని, రక్తాన్ని శుభ్రం చేస్తుందని, జలుబును నయం చేస్తుందని, దేహంలో వ్యాధి నిరోధకత పెంచుతుందని పేర్కొన్నారు. సారంగధర సంహిత, ధన్వంతరి నిఘంటువు, బసవరాజీయం వంటి గ్రంథాలలో కూడా వెల్లుల్లి చికిత్స విధానాల ప్రస్తావన ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. భారతీయ వైద్య విధానాల్లో వస్తుగుణ దీపిక, వస్తుగుణ ప్రకాశిక గ్రంథాల్లో వెల్లుల్లి ఔషధ గుణాలను ప్రస్తావించారు.

తలనొప్పి, క్రిమికీటకాల కాట్లు, నెలసరి నొప్పులు, పేగులలో పురుగులు, గడ్డలు, కణుతులు, హృదయ సంబంధిత వ్యాధులకు వెల్లుల్లి ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లి ధమనులు పూడుకుపోవడం, గట్టి పడటం వంటి వ్యాధులను నిరోధించడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించగలదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులతో పాటు వైద్యులు సైతం వెల్లడించారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్