AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పండ్ల వ్యాపారితో ప్రేమలో పడ్డ పెంపుడు కుక్క..! అతడి రాక కోసం ఎదురు చూపులు..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. రోజూ క్రమం తప్పకుండా తన వద్దకు వచ్చే వ్యక్తి కోసమే అని తెలుస్తోంది. అవును, అది ప్రతిరోజూ వచ్చే పండ్ల విక్రేత కోసం ఎదురు చూస్తోందని ఆ తరువాత తెలిసింది. ఎలాగంటే.. ఆ వీడియోలో కనిపించిన

Watch: పండ్ల వ్యాపారితో ప్రేమలో పడ్డ పెంపుడు కుక్క..! అతడి రాక కోసం ఎదురు చూపులు..
Dog Waiting
Jyothi Gadda
|

Updated on: May 26, 2025 | 11:49 AM

Share

కుక్కలు, పిల్లుల వీడియోలతో సహా అనేక వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంతువులు, పెంపుడు జంతువులకు సంబంధించిన అందమైన వీడియోలను చూసేందుకు ప్రజలు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటిదే వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక అందమైన వీడియో ప్రజల హృదయాలను దోచుకుంటోంది. ఇందులో ఒక పెంపుడు కుక్క చేస్తున్న పని నెటిజన్లను కట్టిపడేసేలా కనిపించింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. రోజూ క్రమం తప్పకుండా తన వద్దకు వచ్చే వ్యక్తి కోసమే అని తెలుస్తోంది. అవును, అది ప్రతిరోజూ వచ్చే పండ్ల విక్రేత కోసం ఎదురు చూస్తోందని ఆ తరువాత తెలిసింది. ఎలాగంటే.. ఆ వీడియోలో కనిపించిన ఆ కుక్క పండ్ల వ్యాపారిని దూరం నుండి చూడగానే ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అతను తన దగ్గరికి వచ్చే వరకు అదే ఎంతో అత్రుతంగా ఎదురు చూస్తుండటం కనిపించింది. పండ్ల వ్యాపారి అక్కడికి వచ్చి, తన బండి నిండా పండ్లను ఆపి, దాని నుండి ఒక పండు తీసుకొని కుక్క దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ కుక్క తన తోకను ఆపకుండా ఊపడం మీరు చూడవచ్చు. ఇక ఆ తర్వాత పండ్ల వ్యాపారి ఆ కుక్కపై ప్రేమతో.. దగ్గరగా వచ్చి ఆ పండు తొక్క తీసి, విరిచి కుక్కకు తినిపిస్తున్నాడు. ఆ కుక్క కూడా అంతే వేగంగా ఆ పండు తింటోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో misty_eva_mauli, missevas_pethouse ఖాతాల నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. వీడియో క్యాప్షన్‌లో ‘క్యూట్ లిటిల్ ఫ్రూట్ టాక్స్ కలెక్టర్’ అని ఉంది. వీడియో చూస్తుంటే.. క్యాప్షన్‌కి తగ్గట్టుగానే ఇది ఆ కుక్క రోజువారీ దినచర్య అని తెలిస్తోంది. ఈ అందమైన వీడియో చూసిన నెటిజన్లు మరింత అందంగా స్పందించారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై