చింతపండు వల్ల వృద్ధాప్యం త్వరగా రాదు.. నిత్య యవ్వనం మీ సొంతం..! కారణం ఏంటంటే..
చింతపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చింతపండులో విటమిన్ సి, బి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి సమ్మేళనాలు ఉన్నాయి. అంతేకాదు.. చింతపండులో అధిక మొత్తంలో టార్టారిక్ యాసిడ్, పొటాషియం, ఫైబర్లు ఉన్నాయి. ఇది మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. చింతపండు తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 26, 2025 | 9:50 AM

tamarind

చింతపండు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, సోడియం రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. చింతపండులో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్ వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది.

చింతపండు శరీరం గ్లూకోజ్ వినియోగాన్ని పెంచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. గుండె సమస్యల్ని పోగొట్టడానికి చింతపండు బాగా పనిచేస్తుంది. చింతపండు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. చింతపండు తింటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెరుగుతుంది. దీంతో గుండె సమస్యలు రావు.

చింతపండులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సంరక్షణకు సహాయపడతాయి. ఇందులోని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ చర్మంలోని చనిపోయిన కణాలను తొలగిస్తాయి. కళ్ళను రక్షిస్తుంది. చింతపండులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది పొడి కళ్ళు, దురదను తగ్గించడంలో సహాయపడుతుంది.

చింతపండులో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వాపు, మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. చింతపండు తింటే ఆర్థరైటిస్ లాంటి సమస్యలను కూడా తగ్గుతాయి. చింతపండును తీసుకోవడం వలన రోగ నిరోధకశక్తి కూడా పెరుగుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.




