- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh started her second innings and busy with half a dozen films
Keerthy Suresh: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కీర్తి .. అరడజన్ సినిమాలతో బిజీ..
కాస్త గ్యాప్ ఇచ్చినట్లే కనిపించినా.. ఇకపై గ్యాప్ లేకుండా వరస సినిమాలు చేయాలని ఫిక్సైపోయారు కీర్తి సురేష్. అందుకే వరసగా ప్రాజెక్ట్స్ ఫైనల్ చేస్తూనే ఉన్నారీ బ్యూటీ. తాజాగా మరో క్రేజీ సినిమా కూడా కీర్తి ఖాతాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో 2 సినిమాలు ఓకే చేసిన ఈ బ్యూటీ.. తాజాగా తమిళంపై ఫోకస్ చేసారు. ఇంతకీ కీర్తి ఇప్పుడెన్ని సినిమాలు చేస్తున్నారు..?
Updated on: May 26, 2025 | 9:50 AM

బేబీ జాన్ తర్వాత తెలియకుండానే కీర్తి సురేష్ కెరీర్‌లో చిన్న బ్రేక్ అయితే వచ్చింది.. పెళ్లైంది కదా ఆ మాత్రం గ్యాప్ రావడం సహజమే అంటున్నారు ఫ్యాన్స్. సెకండ్ ఇన్నింగ్స్ కోసం కాస్త టైమ్ అయినా ఇవ్వాలిగా అంటూ కీర్తికే సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈ క్రమంలోనే అభిమానుల అంచనాలు నిలబెడుతూ.. వరస ప్రాజెక్ట్స్‌కి ఓకే చెప్తున్నారు ఈ కేరళ కుట్టి. రివాల్వర్ రీటా, కన్నివేడి సినిమాలతో త్వరలోనే రానున్నారు కీర్తి. ఈ సినిమాలెప్పుడో సైన్ చేసినవి.. వాటితో పాటు నెట్ ఫ్లిక్స్ కోసం అక్క అనే సిరీస్ చేస్తున్నారీమే.

ఈ టైమ్‌లోనే ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లాడారు. డిసెంబర్‌లో పెళ్లయ్యాక.. కాస్త గ్యాప్ తీసుకుని తెలుగులో బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రౌడీ జనార్ధన సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలోనూ కీర్తికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. కోలీవుడ్ స్టేర్ సూర్య, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రానున్న సినిమాలో కీర్తి సురేష్‌నే హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక మలయాళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో టొవినో థామస్ సినిమాలోనూ హీరోయిన్‌గా ఖరారయ్యారు కీర్తి సురేష్. మొత్తానికి పెళ్లి తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి.. అన్ని ఇండస్ట్రీల్లోనూ మళ్లీ రచ్చ చేస్తున్నారు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.




