Vastu Tips: అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారా.? ఈ వాస్తు టిప్స్ పాటించండి..
సొంతిల్లు లేకో, ఉద్యోగరీత్యా ఇతర ప్రదేశాల్లో ఉండడమో కారణం ఏదైనా.. మనలో చాలా మంది అద్దె ఇంట్లో ఉంటారు. అయితే సొంతింటి విషయంలో వాస్తు నియమాలను పాటించేవారు. అద్దె విషయంలో మాత్రం వాస్తును పెద్దగా పట్టించుకోరు. అయితే అద్దె ఇంటి విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలని..

సొంతిల్లు లేకో, ఉద్యోగరీత్యా ఇతర ప్రదేశాల్లో ఉండడమో కారణం ఏదైనా.. మనలో చాలా మంది అద్దె ఇంట్లో ఉంటారు. అయితే సొంతింటి విషయంలో వాస్తు నియమాలను పాటించేవారు. అద్దె విషయంలో మాత్రం వాస్తును పెద్దగా పట్టించుకోరు. అయితే అద్దె ఇంటి విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అద్దె ఇంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి వాస్తు టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఇంటిని అద్దెకు తీసుకునే ముందు ఆ ఇంట్లో ఈశాన్య భాగం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో భారీ వస్తువులు పెట్టకూడదు. ముఖ్యంగా మంచం, ట్రంక్ వంటి బరువైన వస్తువులను ఇంటికి దక్షిణం లేదా నైరుతి భాగంలో ఉంచాలి.
* బెడ్ రూమ్ కచ్చితంగా నైరు దిశలో ఉండాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అలాగే పడుకునే సయంలో తల దక్షిణ దిశలో, పాదాలు ఉత్తరం వైపు ఉండాలి. ఇది సాధ్యం కాకపోతే, మీరు పడమర వైపు తల పెట్టి నిద్రించవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు.
* ఇక పూజ గది ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. ఈ దిశలో ఎట్టి పరిస్థితుల్లో బాత్‌రూమ్ ఉండకూడదు. ఈశాన్యం దిశలో బాత్‌రూమ్ ఉన్న ఇంట్లో నివసిస్తే అనారోగ్య సమస్యలు మొదలు ఆర్థిక సమస్యల వరకు వెంటాడుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
* ఇక అద్దెకు ఇల్లు తీసుకునే ముందు ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో స్మశానవాటికకు దగ్గరల్లో ఉండకుండ చూసుకోవద్దని వాస్తు పండితులు చెబుతున్నారు.
* అలాగే వాస్తుకు సంబంధం లేకుండా అద్దెకు తీసుకునే ఇంటికి సమీపంలో ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ టవర్లు లేదా విద్యుత్ స్తంభాలు లేకుండా చూసుకోవాలి.
* ఇంట్లోకి దారాలంగా కాంతి వచ్చేలా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంటికి ప్రధాన ద్వారం ఉత్తరం దిశలో ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉదయం డోర్ తీయగానే సూర్యకాంతి ఇంట్లోకి నేరుగా వస్తుంది.
* ఇక వంటగది ఆగ్నేయం దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాకాకుండా వేరే దిశలో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
