AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: పొరపాటున కూడా ఈ దిశలో కూర్చొని భోజనం చేయకండి.. వాస్తు ఏం చెబుతోందంటే..

భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్విసిస్తుంటారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని మనిషి జీవన విధానంలో కూడా వాస్తు ఓ భాగమని వాస్తు పండితులు చెబుతుంటారు. పడుకునే దిశ నుంచి భోజనం చేసే వరకు వాస్తును తప్పకుండా ఫాలో కావాలని చెబుతుంటారు. ఇంట్లో కూర్చొని...

Vastu Tips: పొరపాటున కూడా ఈ దిశలో కూర్చొని భోజనం చేయకండి.. వాస్తు ఏం చెబుతోందంటే..
Vastu
Narender Vaitla
|

Updated on: Mar 16, 2024 | 10:33 PM

Share

భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్విసిస్తుంటారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని మనిషి జీవన విధానంలో కూడా వాస్తు ఓ భాగమని వాస్తు పండితులు చెబుతుంటారు. పడుకునే దిశ నుంచి భోజనం చేసే వరకు వాస్తును తప్పకుండా ఫాలో కావాలని చెబుతుంటారు. ఇంట్లో కూర్చొని భోజనం చేసే దిశలో కూడా వాస్తు ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిశలో కుర్చొని తినాలి.? ఏ దిశలో తినడం ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు ప్రకారం, ఆహారం తీసుకునే విషయంలో పశ్చిమను అశుభకరమైందిగా చెబుతారు. పడమర ముఖంగా కుర్చొని భోజనం చేయడం వల్ల అప్పులు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ దిక్కున కూర్చొని ఆహారం తినడం వల్ల ఇంట్లో దారిద్ర్యం వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఆహారం తినేప్పుడు ఉత్తరం, తూర్పు దిశలను మంచివిగా చెబుతుంటారు. ఆహారం తినడానికి దక్షిణం అత్యంత అశుభకరమైన దిశగా చెబుతుంటారు. దక్షిణ దిక్కును యమ దిక్కుగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం, ఈ దిశలో ఆహారం తీసుకోవడం వల్ల మనిషి వయస్సు తగ్గుతుంది, దురదృష్టం కూడా పెరుగుతుంది.

* ఆహారాన్ని ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ తినాలి. ఈ రెండూ మంచి దిశలుగా చెబుతారు. ఈ దిశల్లో కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు.

* వాస్తు శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు ధరించి భోజనం చేయకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడడమే కాకుండా, అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* స్నానం చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. స్నానం చేయకుండా భోజనం చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

* ఇక ఎట్టి పరిస్థితుల్లో విరిగిన ప్లేట్లలో ఆహారపదార్థాలను తీసుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దారిద్య్రం వెంటాడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం కొందరు వాస్తు పండితులు తెలిపిన విషయాలు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాలను మాత్రమే అందించడం జరిగింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..
ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..
జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'
జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
తల్లికి వందనం కింద ఒకేసారి అకౌంట్లోకి రూ.15 వేలు.. డేట్ ఫిక్స్
తల్లికి వందనం కింద ఒకేసారి అకౌంట్లోకి రూ.15 వేలు.. డేట్ ఫిక్స్