AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్

నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్

Phani CH
|

Updated on: Apr 03, 2026 | 4:15 PM

Share

ఇన్‌స్టాగ్రామ్ AMAలో హీరోయిన్ అదా శర్మను నెటిజన్ అసభ్య ప్రశ్న అడగగా, ఆమె తెలివిగా స్పందించింది. తన 'సైజ్ 9' చెప్పులు చూపిస్తూ సరదాగా సమాధానమిచ్చి నోరు మూయించింది. ఇబ్బందికర ప్రశ్నలను దాటవేయకుండా, ధీటుగా స్పందించిన అదాశర్మ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె హాస్యాన్ని, ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

హీరోయిన్ అదాశర్మ! హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు కుర్రకారుకు హార్ట్ ఎటాక్ తెప్పించిన ఈ బ్యూటీ.. ఈ సినిమా కారణంగా వచ్చిన ఫాలోయింగ్‌తో.. పలు టాలీవుడ్‌ సినిమాల్లో నటించి తెలుగు వాళ్లను మెప్పించింది. కానీ ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి.. అక్కడే సినిమాలు చేస్తోంది. రీసెంట్‌ గా ది కేరళ స్టోరీ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపుతో పాటే అందర్నీ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం వరుస హిందీ సినిమాలతో బిజీగా ఉన్న అదా… సోషల్ మీడియాలోనూ పుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులోనే షేర్ చేస్తుంటుంది. అలాగే సినిమా షూటింగుల నుంచి విరామం దొరికినప్పుడల్లా నెటిజన్లతో ఛాటింగ్ సెషన్ లు కూడా నిర్వహిస్తుంటుంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిస్తుంటుంది. తాజాగా కూడా ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్లతో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ నిర్వహించింది అదా శర్మ. ఈ సందర్భంగా ఒక నెటిజన్ అదా శర్మను ఒక అసభ్యకరమైన ప్రశ్నతో ఇబ్బంది పెట్టాడు. ఇది దురుద్దేశంతో అడిగిన ప్రశ్న అని గ్రహించిన అదా శర్మ.. వెంటనే .. నా సైజు 9 అంటూ తన చెప్పులను చూపించింది. తన రియాక్షన్‌తో నెటిజన్ నోరు మూయించింది. సాధారణంగా, ఇబ్బందికరమైన లేదా అసభ్యకరమైన ప్రశ్న అడిగినప్పుడు, సెలబ్రిటీలు సమాధానం చెప్పడానికి సంకోచిస్తారు. లేదా అలాంటి ప్రశ్నలను దాటవేస్తారు. కానీ, అదా శర్మ అలా చేయలేదు. తనను ఇబ్బంది పెట్టాలన్న నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన యాక్షన్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ బ్యూటీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Meeseva: సామాన్యుడిపై ‘మీ సేవ’ భారం.. 50% చార్జీలు పెంపు

ధురంధర్‌2ను తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ

కిరాణా వ్యాపారికి ఫోన్‌ పే పేరుతో కుచ్చుటోపీ.. ఏం జరిగిందంటే

ఎవరేమనుకున్నా.. ఈ ఎన్నికల్లో నా సపోర్ట్‌ విజయ్‌కే

రోజా కూతురికి అరుదైన గౌరవం.. వావ్ !! గ్రేట్ అఛీవ్‌మెంట్ ఇది

Follow Us