Relationship Tips: అమ్మాయిలూ ఇది మీకోసమే.. పెళ్లి తర్వాత ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుపెట్టుకోండి!

భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే.. ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి. అలాగే ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ..

Relationship Tips: అమ్మాయిలూ ఇది మీకోసమే.. పెళ్లి తర్వాత ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుపెట్టుకోండి!
Relationship Tips
Follow us

|

Updated on: May 24, 2022 | 11:38 AM

హస్బండ్ అండ్ వైఫ్ రిలేషన్ మస్ట్ బీ లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్.. నాట్ ఫిష్ అండ్ ఫిషర్‌మాన్. ఏం సెప్పితిరి.. ఏం సెప్పితిరి అని అనుకుంటున్నారా.! అవునండీ! భార్యాభర్తల మధ్య బంధం ఎప్పుడూ నిప్పు, ఉప్పులా ఉండకూడదు. పప్పు, ఉప్పులా కలిసిపోవాలి. భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే.. ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి. అలాగే ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ.. ఎవరొకరు.. ఏదొక విషయంలో కాస్త తగ్గి జీవితంలో ముందుకు సాగిపోవాలి. చిన్న చిన్న గొడవలే.. పెద్ద పెద్ద అపార్ధాలకు దారి తీస్తాయి. మీ బంధాన్ని బలహీనపడేలా చేస్తాయి. ఇదిలా ఉంటే.. మీ లైఫ్ పార్టనర్‌లో కొన్ని విషయాలు మిమ్మల్ని చికాకు పుట్టించేలా చేస్తాయి. కొన్నిసార్లు అబ్బాయిలను అర్ధం చేసుకోవడంలో అమ్మాయిలు తప్పటడుగు వేస్తుంటారు కూడా. అలాంటి సమయంలో ఇద్దరి మధ్య గొడవలు రావొచ్చు. కాబట్టి పెళ్లి తర్వాత మీ భాగస్వామి విషయంలో అమ్మాయిలు ఈ తప్పులు అస్సలు చేయకండి. అవేంటో తెలుసుకోండి.

  • వారి లైఫ్‌స్టైల్ మార్చాలనుకోవడం:

డ్రెస్సింగ్ సెన్స్, మ్యూజిక్ టేస్ట్, ఫ్రెండ్స్ సర్కిల్.. ఇలా అభిరుచి ఏదైనా కూడా అబ్బాయిలు తమ లైఫ్‌స్టైల్‌ను పెళ్లి ముందు.. ఆ తర్వాత ఒకేలా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ మీకు ఆ లైఫ్ స్టైల్ నచ్చి అతడితో ఏడడుగులు వేస్తే.. కచ్చితంగా అతడి అభిరుచులను మార్చాలని అనుకోవద్దు. ఒకవేళ మార్చాలని ప్రయత్నిస్తే.. మీ మధ్య గొడవలు ఏర్పడటం ఖాయం.

  • సుదీర్ఘ ఫోన్ సంభాషణలు:

ప్రేమలో ఉన్నప్పుడు.. లేదా పెళ్లి చేసుకోబోతున్న సమయంలో సుదీర్ఘ ఫోన్ సంభాషణలు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు. పెళ్లి తర్వాత సుదీర్ఘ ఫోన్ సంభాషణలు అస్సలు పనికి రావని అంటున్నారు. అంతేకాదు అమ్మాయిలకు సుదీర్ఘ ఫోన్ సంభాషణలు ఇష్టమున్నప్పటికీ.. అబ్బాయిలకు మాత్రం అస్సలు నచ్చదు.

ఇవి కూడా చదవండి
  • పైచేయి సాధించాలనుకోవడం:

తమ భాగస్వామిపై ఎప్పుడూ ఆధిపత్యాన్ని చెలాయించాలని అనుకోవద్దు. ఏ విషయంలోనైనా ప్రేమతో వ్యవహరించాలి. భాగస్వామిపై అధికారం లేదా ఆధిపత్యం కోసం తహతహలాడితే.. బంధం బలహీనపడటం ఖాయం.

  • ఎమోషనల్ మానిప్యులేషన్:

భావోద్వేగాల ద్వారా ఒక వ్యక్తి ఏం అనుభూతి చెందుతున్నాడన్నది చెప్పొచ్చు. అమ్మాయిల భావాలను అర్ధం చేసుకోవడంలో అబ్బాయిలు అప్పుడప్పుడూ తప్పటడుగు వేస్తారు. వారి ఎమోషన్స్‌ను సరిగ్గా అర్ధం చేసుకోలేరు. అలా అని చెప్పి అబ్బాయిలను ఎమోషనల్ మ్యానిప్యులేషన్‌తో కట్టిపడేయాలని అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్లే. అది మీ బంధం బలహీనపడటానికి దారి తీయొచ్చు.

  • మిక్స్‌డ్ సిగ్నల్స్:

నిరంతరం తమ భాగస్వామి నుంచి మిశ్రమ సంకేతాలను స్వీకరించిన తర్వాత, కొన్ని సమయాల్లో, చాలా మంది అబ్బాయిలు విస్తుపోతారు.అమ్మాయిల నుంచి వచ్చే సంకేతాలకు అర్ధం ఏంటో తెలియక సతమతమవుతుంటారు. అందుకేనేమో ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ అని అంటారు. అందుకే ఇద్దరి మధ్య సరైన అవగాహన లేకపోతే.. చిన్నపాటి పాజిటివ్ సిగ్నల్ కూడా.. నెగటివ్‌కు దారి తీస్తుంది.

Source: timesnownews