AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cultivating Figs : తియ్యటి పండ్లనిచ్చే ఈ మొక్క రైతులను లక్షాధికారి చేస్తుంది..! కేవలం ఒక మొక్క ద్వారా రూ.12 000 ఆదాయం..

Cultivating Figs : ప్రస్తుత కాలంలో ఔషధ మొక్కలవైపు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి కారణం తక్కువ ఖర్చు, అధిక లాభాలు.

Cultivating Figs : తియ్యటి పండ్లనిచ్చే ఈ మొక్క రైతులను లక్షాధికారి చేస్తుంది..! కేవలం ఒక మొక్క ద్వారా రూ.12 000 ఆదాయం..
Cultivating Figs
uppula Raju
|

Updated on: Jun 28, 2021 | 7:45 PM

Share

Cultivating Figs : ప్రస్తుత కాలంలో ఔషధ మొక్కలవైపు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి కారణం తక్కువ ఖర్చు, అధిక లాభాలు. అందుకే పెద్ద మొత్తంలో ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కూడా దీనిని ప్రోత్సహిస్తోంది. అలాంటి కోవలోకే వస్తుంది అత్తి. నేడు భారతదేశంలోని అనేక రాష్ట్రాల రైతులు దీనిని సాగు చేస్తున్నారు. డిడి కిసాన్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. అత్తి పండ్లలో 83 శాతం చక్కెర ఉంటుంది. ఈ కారణంగా ఇది ప్రపంచంలోనే తియ్యటి పండ్లుగా పరిగణిస్తారు.

తక్కువ ఖర్చు, ప్రత్యేక సంరక్షణ అవసరాలు లేనందున అత్తి పండ్ల పెంపకం సౌకర్యవంతంగా ఉంటుంది. అదే సమయంలో, దీని నుంచి వచ్చే ఆదాయం కూడా లాభసాటిగా ఉంటుంది. రైతులు పూర్తిగా పెరిగిన అత్తి మొక్క నుంచి ఒకేసారి 12000 రూపాయలు సంపాదించవచ్చు. అత్తి మొక్క పెరగడానికి వేడి అవసరం. దీన్ని ఏ రకమైన మట్టిలోనైనా నాటవచ్చు. దాని సాగు కోసం నేల pH విలువ 6 నుంచి 7 మధ్య ఉండాలి. సాగుకు సాధారణ వర్షపాతం అవసరం. అత్తి పండ్ల సాగు కోసం పాత పంటల అవశేషాలను పూర్తిగా శుభ్రపరచడం అవసరం. ఆ తరువాత మట్టిని సమం చేస్తారు.

గుంతలను ఒకదానికొకటి ఐదు మీటర్ల దూరంలోరెండు అడుగుల వెడల్పు,1.5 అడుగుల లోతులో తవ్విస్తారు. గుంతలు సిద్ధమైన తరువాత, సేంద్రీయ, రసాయన ఎరువులు మట్టిలో కలుపుతారు. మంచి నీటి పారుదల వ్యవస్థ ఉన్న పొలంలో మాత్రమే అత్తి పండ్లను పెంచడం మంచిది. అత్తి మొక్కలకు శీతాకాల వాతావరణం అనుకూలంగా ఉండదు. వేసవి కాలంలో దీని మొక్కలు బాగా అభివృద్ధి చెందుతాయి. వేసవి కాలంలో పండించడం ద్వారా పండ్లు కూడా విక్రయానికి సిద్ధంగా ఉంటాయి.

మొక్కలు రెండేళ్లలో దిగుబడి ఇవ్వడం ప్రారంభిస్తాయి.. ఎక్కువ ఉత్పత్తి పొందడానికి, మెరుగైన రకాల అత్తి పండ్ల ఎంపిక అవసరం. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అత్తి సాగు జరుగుతోంది. ప్రాంతం, అక్కడి వాతావరణం ప్రకారం రైతులు దాని రకాలను ఎంచుకుంటారు. భారతదేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్లలో సాగు చేస్తారు. అత్తి మొక్కలు సుమారు రెండు సంవత్సరాల తరువాత దిగుబడిని ఇస్తాయి. నాలుగైదు సంవత్సరాల వయస్సు గల మొక్క నుంచి సుమారు 15 కిలోల పండ్లు లభిస్తాయి. మొక్కలు పెరిగేకొద్దీ వాటి పరిమాణం పెరుగుతుంది. దీని పండ్లు పెద్దవి, రుచికరమైనవి. అత్తి పండ్ల పండ్లు పసుపు రంగులో ఉంటాయి.

Suffering Cold and Cough : జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..! అయితే ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి..

Telangana Corona Cases: తెలంగాణ‌లో కొత్తగా 993 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా

Roja Selvamani: ఘనంగా నటి రోజా కొడుకు పుట్టినరోజు వేడుకలు.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్..