Telangana Corona Cases: తెలంగాణ‌లో కొత్తగా 993 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా

తెలంగాణ‌లో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు వెయ్యిలోపు కేసులు వెలుగుచూశాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,12,982 మందికి....

Telangana Corona Cases: తెలంగాణ‌లో కొత్తగా 993 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 28, 2021 | 7:19 PM

తెలంగాణ‌లో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు వెయ్యిలోపు కేసులు వెలుగుచూశాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 1,12,982 మందికి కరోనా టెస్టులు చేయ‌గా… 993 మంది వైరస్​ సోకిన‌ట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 9 మంది వైర‌స్ కారణంగా ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కొత్త‌గా మరో 1,417 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 13,869 కొవిడ్​ యాక్టివ్​ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 124 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడ‌గా, నల్గొండలో 78, సూర్యాపేటలో 72, మంచిర్యాలలో 59, భద్రాద్రి కొత్తగూడెంలో 58, ఖమ్మంలో 50, మహబూబాబాద్‌లో 51 కేసులు నమోదయ్యాయి.

దేశంలో 40 వేలు దాటేసిన బ్లాక్‌ఫంగస్‌ కేసులు

కరోనా విజేత‌ల్లో బయటపడుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 40,845 కేసులు వెలుగు చూసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ తెలిపారు. వీరిలో 3,129మంది మృతి చెందినట్టు వెల్ల‌డించారు. సోమవారం మంత్రుల టీమ్ 29వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితి, వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్‌ సహా పలు అంశాలపై మినిస్ట‌ర్స్, ఉన్నతాధికారులు చర్చించారు. బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినవారిలో 13,083 మంది (32శాతం) 18 నుంచి 45 ఏళ్లు లోపువారేనని కేంద్ర ఆరోగ్యశాఖ వివ‌రించింది. అలాగే, 17,464 (42శాతం) మంది 45 నుంచి 60 ఏళ్ల లోపువారు కాగా.. 10,082 (24శాతం) మంది 60 ఏళ్లు దాటినవారు ఉన్నట్టు వెల్ల‌డించింది. ఈ మీటింగ్‌లో ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ మాట్లాడుతూ.. దేశంలో సెకండ్‌వేవ్ తీవ్ర‌త‌ ఇంకా తగ్గలేదన్నారు. ఇప్పటికే 80 జిల్లాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్టు చెప్పారు. వ్యాక్సిన్లు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై సమర్థంగానే పనిచేస్తున్నట్టు టెస్టుల్లో గుర్తించామ‌ని చెప్పారు.

Also Read: టీచర్ ఎకౌంట్ నుంచి మాయం అయిన మూడు లక్షల రూపాయలు.. పోలీసులు తేల్చింది ఏమిటంటే..

ఉద్యోగ అవసరాల మీద విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా ఆరోగ్య శాఖ

రూ.5 కోట్లు పెట్టి 54 కోట్లు సంపాదించిన హీరోయిన్..
రూ.5 కోట్లు పెట్టి 54 కోట్లు సంపాదించిన హీరోయిన్..
ఓర్నీ... ఇంకో జన్మంటూ ఉంటే..ఇలా కుక్కలా పుట్టాలి..
ఓర్నీ... ఇంకో జన్మంటూ ఉంటే..ఇలా కుక్కలా పుట్టాలి..
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా