Corona Vaccine : ఉద్యోగ అవసరాల మీద విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా ఆరోగ్య శాఖ

ఉద్యోగ అవసరాలపై విదేశాలకు వెళ్లే వారికి కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు తెలంగాణా ఆరోగ్య శాఖ ప్రకటించింది. విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారు పాస్..

Corona Vaccine : ఉద్యోగ అవసరాల మీద విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా ఆరోగ్య శాఖ
Flight tickets
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 28, 2021 | 6:39 PM

Telangana Health Department : ఉద్యోగ అవసరాలపై విదేశాలకు వెళ్లే వారికి కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు తెలంగాణా ఆరోగ్య శాఖ ప్రకటించింది. విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారు పాస్ పోర్ట్, వర్క్ పర్మిట్ వీసా లను చూపించి ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా పొందవచ్చని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అర్హులైన వారికి కోవిషీల్డ్ టీకాలను 28 రోజుల వ్యవధిలో రెండు డోస్ లు ఇవ్వనున్నట్టు తెలిపింది. మొత్తంగా విదేశాలకు వెళ్లే ఉద్యోగస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 టీకా కేంద్రాలను కేటాయించింది వైద్య ఆరోగ్య శాఖ.

ఇలా ఉండగా, విదేశాలకు వెళ్లే భారతీయుల పాస్‌పోర్టులను వ్యాక్సినషన్‌తో లింక్ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీన ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్‌ సహా ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ కొవిన్‌ ఆధారిత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌కు తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే వీరిలో ఇప్పటికే తొలి డోసు తీసుకున్నవారు 28 రోజుల తర్వాత కొవిషీల్డ్‌ రెండో డోసు తీసుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది.

విదేశాలకు వెళ్లే భారతీయులకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్‌ను ఈ సందర్భంగా కేంద్రం వెల్లడించింది. ఈ ప్రయాణాలు చేసే వారి కొవిన్ సర్టిఫికెట్లను సదరు వ్యక్తుల పాస్‌పోర్టులకు లింక్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య విరామాన్ని 84 రోజుల వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది.

Read also :  YCP MP : ఇంత నీచమైన పనులు రాజ వంశీకులు చేయాల్సినవేనా అశోక్..? ఇది ఒక నీటి బొట్టే. ఇంకా చాలా వస్తాయి బయటకు : విజయసాయిరెడ్డి

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
పర్సనల్‌ లోన్స్‌ పొందడం ఇక మరింత ఈజీ..!
పర్సనల్‌ లోన్స్‌ పొందడం ఇక మరింత ఈజీ..!
ఐక్యూబ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటన
ఐక్యూబ్‌ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటన