Secrets of Indian Lake: రహస్యాలకు కేరాఫ్‌గా మారిన సరస్సు.. నాసా శాస్త్రవేత్తలే చేతులెత్తేశారు.. భారత్‌లో ఎక్కడుందంటే..
భారతదేశంలో ఎన్నో సరస్సులు ఉన్నాయి. అయితే వాటన్నింటికీ పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఒక్క సరస్సు మాత్రం ఇప్పటికీ అనేక ప్రశ్నలను..
Secrets of Lonar lake: భారతదేశంలో ఎన్నో సరస్సులు ఉన్నాయి. అయితే వాటన్నింటికీ పెద్దగా గుర్తింపు లేదు. కానీ ఒక్క సరస్సు మాత్రం ఇప్పటికీ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చివరికి నాసా శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాలను చేధించలేకపోయారు. అదే లూనార్ సరస్సు.
వివరాల్లోకెళితే.. మహారాష్ట్రలోని బుల్ధన జిల్లాలో లూనార్ సరస్సు ఉంది. ఈ సరస్సు అనేక ప్రశ్నలకు నెలవు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీనిని తేల్చే పనిలో పడ్డారు. నాసా మొదలు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన పలు ఏజెన్సీలు ఈ సరస్సుపై చాలా సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నాయి. అయితే ఈ సరస్సు రహస్యం ఇప్పటికీ పరిష్కరించబడని పజిల్‌గానే మిగిలిపోయింది.
ప్రపంచంలో అనేక సరస్సులు ఉన్నాయి. కొన్ని మానవ నిర్మితాలయితే.. మరికొన్ని ప్రకృతి పరంగా ఏర్పడినవి ఉన్నాయి. అలా ప్రకృతి పరంగా ఏర్పడినదే.. లూనార్ సరస్సు. ముందుగా ఈ సరస్సును ఎవరూ గుర్తించలేదు. కొంత కాలం తరువాత గుర్తించబడినప్పటికీ.. ఆ సరస్సు విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుండ్రంగా.. కొండ మధ్య ఏర్పడినట్లుగా ఉండే ఈ సరస్సు ఎలా ఏర్పడిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉల్కాపాతం భూమిని తాకడం వల్ల ఈ సరస్సు ఏర్పడిందని పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ అభిప్రాయాన్ని మరికొందరు విశ్లేషకులు ఖండిస్తున్నారు. కారణం.. ఉల్కాపాతం వల్లే ఇది ఏర్పడినట్లయితే.. ఉల్క ఆనవాళ్లు ఉండాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు.
భూ ఉపరితలానికి అరకిలోమీటర్ లోతులో.. లూనార్ సరస్సు భూమి ఉపరితలానికి సరాసరి అర కిలోమీటర్ కంటే ఎక్కువ లోతులో ఏర్పడింది. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 70 సంవత్సరాల క్రితం కొందరు శాస్త్రవేత్తలు ఈ సరస్సు ఎలా ఏర్పడిందనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక ఉల్క సెకనుకు 22 కిలోమీటర్ల వేగంతో భూమిని ఢీకొట్టిందని, దాని కారణంగా ఒక బిలం ఏర్పడి అది క్రమంగా సరస్సులా మారిందని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు మాత్రం లభించలేదు.
వేదాలలో లూనార్ సరస్సు ప్రస్థావన! ఈ వాదనలు ఇలా ఉంటే.. మరో ప్రముఖ వాదన కూడా తెరపైకి వచ్చింది. అగ్నిపర్వతం పేలడం ద్వారా ఏర్పడిందని కొందరు అంటుంటే.. అదేంకాదు లూనార్ సరస్సు వేదకాలం నాడే ఏర్పడిందని ఇంకొందరు అంటున్నారు. ఆ సరస్సు ఏర్పడటానికి శ్రీమహా విష్ణువే కారణం అని చెబుతున్నారు. రుగ్వేదం, స్కందపురాణాలలో కూడా ఈ సరస్సు ప్రస్తావన ఉంది. విష్ణువు, ఓ రాక్షసుడిని సంహరించిన సందర్భంలో ఈ సరస్సు ఏర్పడిందని కొందరు వాదిస్తున్నారు. పురాతన దేవాలయాల అవవేశాలు ఈ సరస్సు పరిసరాల్లో కనిపించడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
2006 లో ఈ సరస్సు ఎండిపోయింది.. ఈ సరస్సు పూర్తిగా రసాయన లక్షణాలతో నిండి ఉందని సైంటిస్టులు తేల్చారు. కొన్నేళ్ల క్రితం నాసా శాస్త్రవేత్తలు ఈ సరస్సు బసాల్టిక్ శిలల నుండి ఉద్భవించిందని చెప్పారు. అంగారక ఉపరితలంపై ఇలాంటి సరస్సులు కూడా కనిపిస్తాయని వారు తెలిపారు. కాగా, ఈ సరస్సు 2006 సంవత్సరంలో పూర్తిగా ఎండిపోయిందని స్థానిక ప్రజలు తెలిపారు. ఆ సమయంలో సర్సులో చిన్న చిన్న ఖనిజ ముక్కలు మెరుస్తూ కనిపించాయని వారు చెప్పారు. వీరు చెప్పిన మాటలే సరస్సు ఉద్భవాన్ని తేల్చేందుకు సాధనంగా మారాయి. అయితే, కొద్ది కాలానికే ఈ ప్రాంతంలో భారీ వర్షం పడటంతో లూనార్ సరస్సు మళ్లీ నీటితో నిండిపోయింది. ఇదిలాఉంటే.. శతాబ్ధాల తరబడి ప్రశ్నార్థకంగా నిలిచిన లూనార్ సరస్సు పుట్టుక గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
Also read:
అది ప్రభుత్వ ఉద్యోగి హక్కు.. వడ్డీతో సహా మొత్తం చెల్లించాల్సిందే: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..