కన్నుల ముందు కదలాడుతున్న శివుడు.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న 24 అడుగుల విగ్రహం.. ఎక్కడంటే..

అనంత విశ్వంలోని నిరంతర చైతన్య స్వరూపమే మహాశివుడిని దర్శింపజేస్తుంది. అదే శివతాండవం. సాక్ష్యాత్తు పరమశివుడే కళ్ళముందుకు వచ్చి

  • Rajitha Chanti
  • Publish Date - 9:06 am, Fri, 26 February 21
కన్నుల ముందు కదలాడుతున్న శివుడు.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న 24 అడుగుల విగ్రహం.. ఎక్కడంటే..

Robotic Lord Shiva Statue in Ongole:  అనంత విశ్వంలోని నిరంతర చైతన్య స్వరూపమే మహాశివుడిని దర్శింపజేస్తుంది. అదే శివతాండవం. సాక్ష్యాత్తు పరమశివుడే కళ్ళముందుకు వచ్చి తాండవం చేస్తే ఎలా ఉంటుంది ? చూడాటానికి రెండు కళ్ళు చాలవు కదు. కానీ ఒక ప్రాంతంలో మాత్రం శివుడు ఉగ్రరూపంతో నాట్యం చేశాడు. అవును ఇది నిజమే. ఒకటి కాదు..రెండు కాదు 24 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం.. కళ్ల ముందే శివతాండవం.. శివుని కొప్పు నుంచి ఎగిసిపడుతున్న గంగాజలం .. ఇవన్నీ కనుల ముందు కనిపిస్తే ఎలా ఉంటుంది..? ఒంగోలువాసులను ఆ అదృష్టం వరించింది.

ఇప్పటి వరకు మనం చాలా రకాల శివుని విగ్రహాలు చూశాం.. కానీ ఇప్పుడు మనం చూస్తున్న శివుడి విగ్రహం చాలా స్పెషల్‌. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు దేవాలయాల్లో చూసే విగ్రహం కాదు.. ప్రత్యేకమైన రోబోటిక్‌ విగ్రహం. స్టాట్యూ అంటే కదలకుండా ఉంటుంది. కానీ ఈ రోబోటిక్‌ విగ్రహం మాత్రం కాళ్లు, చేతులు కదిలిస్తుంది.. నాట్యం కూడా చేస్తుంది. ఆ 24 అడుగుల ఈ రోబోటిక్‌ విగ్రహం శివతాండవం చూసి, ఆనందపారవశ్యంలో మునిగిపోతున్నారు ఒంగోలువాసులు.

ప్రకాశం జిల్లా ఒంగోలు నగర వీధుల్లో 24 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం శివతాండవం చేస్తుండగా పురవీధుల్లో ఊరేగించారు ఆలయ నిర్వాహకులు.  కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రోబోటిక్‌ శివుని విగ్రహం కాళ్ళూ, చేతులు కదిలిస్తూ నగర వీధుల్లో ఊరేగుతుంటే భక్తజనం దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒంగోలు సంతపేటలోని సాయిబాబు దేవాలయం ప్రాంగణంలో శివరాత్రి సందర్బంగా ఏర్పాటు చేసిన యజ్ఞం నేపధ్యంలో ఈ ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు నిర్వంచారు. ఈ ఊరేగింపులో కేరళ నుంచి తెచ్చి ప్రదర్శించిన 24 అడుగుల శివుని రోబోటిక్‌ విగ్రహం చూపరులను ఆకట్టుకుంది… సాయంత్రం, రాత్రి వేళల్లో నగరంలో శివుని విగ్రహం ఊరేగింపు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంది… కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన రోబోటిక్‌ విగ్రహాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా ఒంగోలులో ప్రవేశపెట్టామని నిర్వాహకులు తెలిపారు…

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల విగ్రహాలను నగరంలో ఊరేగించే సందర్భంగా ఈ రోబోటిక్‌ శివుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Also Read:

మాఘ పూర్ణిమ 2021: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి ? ఆరోజున ఏవిధంగా భగవంతుడిని ఆరాధించాలంటే..

తీర్థయాత్రలకు వెళ్లేవారు తెలుసుకోవల్సిన విషయాలు.. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన సందేశంలోని అంతర్యాం..

Puja Rules: ఇంట్లో పూజా-పారాయణం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలెంటో తెలుసా ?