తీర్థయాత్రలకు వెళ్లేవారు తెలుసుకోవల్సిన విషయాలు.. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన సందేశంలోని అంతర్యాం..

చాలా మంది తీర్థయాత్రలు చేస్తుంటారు. కన్యాకుమారీ నుంచి కాశీ వరకు ప్రతి ఒక్క దేవుడిని సందర్శిస్తుంటారు. అయితే చాలా మందికి అసలు తీర్థయాత్రలకు ఎందుకు చేయాలి.

తీర్థయాత్రలకు వెళ్లేవారు తెలుసుకోవల్సిన విషయాలు.. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన సందేశంలోని అంతర్యాం..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 24, 2021 | 11:51 AM

చాలా మంది తీర్థయాత్రలు చేస్తుంటారు. కన్యాకుమారీ నుంచి కాశీ వరకు ప్రతి ఒక్క దేవుడిని సందర్శిస్తుంటారు. అయితే చాలా మందికి అసలు తీర్థయాత్రలకు ఎందుకు చేయాలి. ఎలా చేస్తే.. భగవంతుడి కృప కలుగుతుందనేది తెలియదు. తీర్థయాత్రల గురించి శ్రీకృష్ణుడు పాండవులకు సందేశమిచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకసారి పాండవులందరూ కలిసి తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని తమ శ్రేయోభిలాషి, ఆత్మబంధువైన శ్రీకృష్ణుడికి చెప్పి.. తనను కూడా తమ వెంట రమ్మని అడుగుతారు. ఈ విషయం చెప్పగానే కృష్ణుడు.. తాను పనులు ఒత్తిడి వలన రాలేకపోతున్నానని.. తనకు బదులుగా ఓ కాయను తమతోపాటు తీర్థయాత్రలన్నింటిని తిప్పండి అని చెప్పి ఓ సొరకాయను ఇస్తాడు. వాళ్ళు సంతోషంగా తమ వెంట ఆ కాయను తీసుకెళ్ళారు. గంగ సహా అన్ని పుణ్యనదుల్లో, సాగారాల్లో స్నానాలు చేసి.. పుణ్యక్షేత్రాలన్నింటిని సందర్శించారు. తమ తీర్థయాత్రలన్నింటినీ ముగించుకోని తిరిగి హస్తినాపురానికి చేరుకున్నారు. అనంతరం కృష్ణుడి పాదాలకు నమస్కరించి ఆ సొరకాయను తిరిగి ఇస్తారు. అయితే ఆ మధ్యాహ్నమే కృష్ణుడు పాండవులకు ఆతిధ్యాన్నిచ్చాడు. అందులో వారికి ఇచ్చిన సొరకాయను కూరగా చేయించి పాండవులకు వడ్డిస్తాడు. అది తినగానే పాండవులకు చేదుగా అనిపించింది. దీంతో ఇదేంటి కృష్ణా.. ఈ చేదు సొరకాయతో భోజనం పెట్టావు అని ప్రశ్నించగా.. అయ్యో అన్ని పుణ్యతీర్థాలు తిప్పారు కాదా అయితే ఈ సొరకాయ చేదుగా అయ్యిందా.. మీతో పాటే తీసుకెళ్ళారు కాదా తీపిగా అయ్యుంటుందనుకున్నాను అని అంటాడు. దీంతో శ్రీకృష్ణుడి మాటల్లోని అర్థాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు పాండవులు. మనసులో మార్పు రాకుండా ఎన్ని తీర్థాలు చేసిన ఫలితం శూన్యం అని. అందుకే దేవుడిని స్మరించేప్పుడు మనసులో స్వార్థభావం లేకుండా ఉండాలని పురణాలు చెబుతుంటాయి.

Also Read:

భీష్మ ఏకాదశి 2021: భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత.. విష్ణువుని ఏలా పూజించాలి.. ఆరోజున చేయకూడని పనులెంటీ..