భీష్మ ఏకాదశి 2021: భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత.. విష్ణువుని ఏలా పూజించాలి.. ఆరోజున చేయకూడని పనులెంటీ..

మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని 'భీష్మ ఏకాదశి' అంటారు. ఫిబ్రవరి 23 భీష్మ ఏకాదశి. దీనిని జయ ఏకాదశి,

భీష్మ ఏకాదశి 2021: భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత.. విష్ణువుని ఏలా పూజించాలి.. ఆరోజున చేయకూడని పనులెంటీ..
Follow us

|

Updated on: Feb 23, 2021 | 7:17 AM

మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి’ అంటారు. ఫిబ్రవరి 23 భీష్మ ఏకాదశి. దీనిని జయ ఏకాదశి, అన్నాడ ఏకాదశి, కామికా ఏకాదశి వంటి పేర్లతో పిలుస్తారు. శ్రీ కృష్ణుడు భీష్మ ఏకాదశి గురించి వివరించాడు. గంగామాత స్త్రీరూపంలో దరించినపుడు అష్టవసువుల్లో ఆమెకు పుట్టిన ఏడవ కుమారుడే భీష్ముడు. ఈ రోజు నిష్టగా ఉపవాసం చేయడం వలన బాధలన్ని తొలగిపోతాయని.. దెయ్యాలు, భూతాలు, పిశాచాల వంటి శక్తుల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతుంటారు. కానీ ఈ ఉపవాసం చేయడానికి ముందు దీనికి గల నియమాలను తెలుసుకోవాలి. ఏకాదశి మూడు రోజులు ఉంటుంది.

భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత..

46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ రోజునే స్వచ్ఛంద మరణమనే వరం ద్వారా ప్రాణ త్యాగం చేసినందువల్ల మాఘశుద్ధ అష్టమికి భీష్మాష్టమి అని పేరు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయనీ విశ్వాసం.

పూజా విధానం..

పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించుకోవాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం ‘ఓం నమోనారాయణాయ‘ అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.

భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. శిరఃస్నానం చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి. దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు ఉంటుంది.

ఇక ఈ రోజు చేయకూడని పనులెంటో తెలుసుకుందాం..

➦ ఈరోజున మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు మొదలైనవి తినకూడదు. శాకాహారం మాత్రమే తినాలి. ద్వాదాశి రోజున ఉపవాసం పాటించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ➦ ఏకాదశి రోజున ఇంట్లో బియ్యం వండకూడదు. ఈరోజున అన్నం తినకుండా ఉపవాసం చేయాలని చెబుతుంటారు. ➦ ద్వాదాశి వరకు బ్రహ్మచర్యను సంయమనంతో పాటించాలి. ➦ ఏకాదశి రోజున.. ఇంటిని శుభ్రం చేసుకోకుడదు. ఎందుకంటే చీమలు, పురుగులు వంటి చంపే అవకాశం ఉంటుంది. దీంతో మీరు పాపం చేసిన వారుగా పరిగణించబడతారు. ఈరోజున ఏ జంతువుకు హాని తలపెట్టకూడదు. ➦ ఏకాదశి చాలా సద్గుణమైన మరియు భగవంతుని ఆరాధించే రోజు కాబట్టి సూర్యుడు రావడానికి ముందే మేల్కోని సాయంత్రం వరకు నిద్రపోకూడదు. వీలైతే భగవంతుడి కీర్తనలు చేస్తూ.. రాత్రంతా జాగరం చేయాలి. ➦ ముందు మనస్సుతోపాటు ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకోవాలి. అందువల్ల ఎవరి మనసులో దుర్మార్గపు భావనను తీసుకురాకుడదు. ఎవరికీ చెడు తలపెట్టకూడదు. ➦ ఈరోజున జుట్టు కత్తిరించకూడదు. ఎక్కువగా ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. కొన్ని సందార్భాల్లో అసత్య పదజాలం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎక్కువగా మాట్లాడకూడదు. ➦ ఈరోజున భగవద్గీతను పఠించడం మంచింది. పేదవారికి ధానంచ చేయడం, ఉపవాసం ఉండడం మంచింది.

Also Read:

శివుడిని బిల్వ పత్రాలతో ఎందుకు పూజిస్తారు ? సోమవారం బిల్వనీటితో అభిషేకం చేయడానికిగల అంతర్యం..