Bedi Hanuman Temple: సముద్రం ఆ క్షేత్రంలోకి రాకుండా.. సంకెళ్లతో కాపలా కాస్తున్న ఆంజనేయస్వామి ఎక్కడో తెలుసా..!
భారత దేశంలో ఎన్నో చారిత్రాత్మక నగరాలు, ప్రసిద్ధి క్షేత్రాలు... పురాతన పట్టణాలు ఉన్నాయి. ప్రసిద్ధి క్షేత్రాల్లో ఒకటి ఒడిస్సాలోని పూరీ జగన్నాథ దేవాలయం. ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి దేవాలయం కూడా ఒకటి ఉంది. ఈ ఆలయాన్ని...
Bedi Hanuman Temple: భారత దేశంలో ఎన్నో చారిత్రాత్మక నగరాలు, ప్రసిద్ధి క్షేత్రాలు… పురాతన పట్టణాలు ఉన్నాయి. ప్రసిద్ధి క్షేత్రాల్లో ఒకటి ఒడిస్సాలోని పూరీ జగన్నాథ దేవాలయం. ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి దేవాలయం కూడా ఒకటి ఉంది. ఈ ఆలయాన్ని”దారియా మహావీర” దేవాలయం అని కూడా పిలుస్తారు. కాగా ఈ ఆలయంలో ఆంజనేయస్వామిని సంకెళ్లతో బంధించి ఉంచుతారు. ఇలా ఆంజనేయస్వామిని బంధించి ఉంచడానికి స్థల పురాణం ఉన్నది.
జగన్నాథుడు ఈ పుణ్య క్షేత్రం లో వెలసిన తర్వాత జగన్నాథుని దర్శనం కోరి సముద్ర దేవుడు ఈ దేవాలయాన్ని సందర్శించాడు. అలా సముద్ర దేవుడు రావడంతో సముద్రంలోని నీరు అంతా.. ఈ ప్రదేశంలోకి చేరి అపార హాని జరిగింది. అక్కడ ప్రజలు సముద్రుడి నుంచి తమని రక్షించమని జగన్నాథుడిని ప్రార్ధించారు. భక్తుల ప్రార్ధనలతో జగన్నాథుడు ప్రసన్నుడై.. రక్షకుడైన ఆంజనేయుడు గురించి విచారించగా హనుమంతుడు తన అనుమతి లేకుండా అయోధ్య వెళ్ళినట్లు తెలుసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన జగన్నాథుడు ఈ క్షేత్రాన్ని పగలు, రాత్రి కాపలా కాచే బాధ్యతను ఆంజనేయుడు మరచిపోయాడని భావించి ఆంజనేయుడి యొక్క కాళ్లుచేతులను పగ్గంతో కట్టి వేసి.. ఇక ముందు ఇక్కడే సదా వెలసి ఉండు.. ఈ క్షేత్ర ప్రదేశంలో సముద్రపు నీరు దరిచేరకుండా కాపలాకాయి అని చెప్పాడట. అప్పటి నుంచి ఈ హనుమనుమంతుడు సంకెళ్లతో దర్శనమిస్తాడు.. అప్పటి నుంచి ఈ స్వామిని “దరియా మహావీర” అని కూడా పిలుస్తారు.. ఇక్కడ హనుమంతుడిని.. దారియా అంటే సముద్రం.. అని అర్ధం. అంటే మహావీరుడైన హనుమంతుడు సముద్రం నుంచి తమ మహానగరాన్ని కాపాడుతున్నాడని… అక్కడ ప్రజల నమ్మకం. అక్కడ ప్రజలు ఈ ఆంజనేయ స్వామిని “బేడీ హనుమంతుడు” అని కూడా పిలుస్తారు. స్థలం పురాణం ప్రకారం ఈ స్థలం సముద్ర తీరం దగ్గర ఉన్నా కూడా ఎటువంటి తుఫాను సంభవించినా… సముద్రపు నీరు దరిచేరలేదని అక్కడ ప్రజలు చెబుతారు.
Also Read: