AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా.? అయితే ఈ రాశి వారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది..

Horoscope Today: ప్రతీరోజు చాలా మంది ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అది వాహన కొనుగోలు అయ్యుండొచ్చు, నూతన పెట్టుబడులు..

Horoscope Today: కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా.? అయితే ఈ రాశి వారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది..
Narender Vaitla
|

Updated on: Feb 23, 2021 | 7:16 AM

Share

Horoscope Today: ప్రతీరోజు చాలా మంది ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అది వాహన కొనుగోలు అయ్యుండొచ్చు, నూతన పెట్టుబడులు అయ్యుండొచ్చు. అయితే మనం తీసుకునే నిర్ణయం మంచి రోజున అయ్యుంటే బాగుంటుంది కదూ.. మరి రాశి ఆధారంగా ఈరోజు మీరు ఏ పనులు చేపడితే మేలు జరుగుతుంది. ఏ పనులకు దూరంగా ఉంటే బాగుంటుంది లాంటి వివరాలను ఈరోజు (మంగళవారం) రాశి ఫలాల్లో తెలుసుకుందాం..

మేష రాశి:

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యమైన పనులు చేపట్టే సమయంలో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు కచ్చితంగా తీసుకోవాలి. ఈ రాశివారు ఈ రోజు శ్రీవెంకటేశ్వర స్వామిని సందర్శిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.

వృషభ రాశి:

వృషభ రాశి వారు ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు. అలాగే మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చంద్ర గ్రహణ ఆరాధణ, శివ పంచాక్షరి జపం చేయడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.

మిథున రాశి:

ఈ రాశివారికి ఈరోజు చేపట్టిన పనుల్లో అనుకూలత కనిపిస్తోంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేద వారికి అన్న వస్త్రాలు దానం చేసుకుంటే మిథున రాశి వారికి మంచి జరుగుతుంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈరోజు వ్యవహారిక విషయాల్లో అనుకూలత కనిపిస్తోంది. శ్రమ పెరిగినా దానికి సంబంధించిన ఫలితం పొందే అవకాశాలున్నాయి. తులసి దళంలతో శ్రీకృష్ణుడిని పూజించడం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.

సింహ రాశి:

ఈ రాశి వారికి ఈరోజు చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అప్పుల బాధలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మహా గణపతిని పూజించడం ద్వారా ఈ రాశి వారికి మేలు జరుగుతుంది.

కన్య రాశి:

కన్య రాశి వారి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తికి మించిన పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు. ఐశ్వర్య లక్ష్మిని ఉపాసించడం ద్వారా మంచి జరుగుతుంది.

తుల రాశి:

ఈ రాశి వారు ఈరోజు విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తిగతంగా చేపట్టిన పనుల్లో కొంత బద్ధకం కనిపిస్తోంది, జాగ్రత్తగా ఉండడం మంచిది. నవగ్రహాల్లో శనేశ్చర స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు ఈరోజు మిత్రులతో వివాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గణపతికి ఉండ్రాలు సమర్పించుకోవడం వల్ల మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి:

ఈ రాశి వారికి ఈరోజు నూతన ఉద్యోగ లాభాలు కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దార్మిక పరమైన భావాలు పెరుగుతుంటాయి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. పేదవారికి అన్నదానం చేసుకోవడం వీరికి మంచి చేస్తుంది.

మకర రాశి:

మకర రాశి వారికి ఈరోజు కుటుంబంలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. ప్రతీ విషయంలో తొందర పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. సుదర్శన స్వామి నామస్మరణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

కుంభ రాశి:

ఈ రాశి వారు ఈరోజు కుటుంబపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక పరమైన సభలు, సమావేశాలను నిర్వహించే ప్రయత్నం చేస్తారు. మహాలక్ష్మి స్తోత్ర పరాయణం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

మీన రాశి:

మీన రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితులను మెరుగు పరుచుకునే అవకాశాలు లభిస్తాయి. వీరు ఈరోజు ముఖ్యమైన విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధగా వ్యవహరించకూడదు. నవగ్రహ స్తోత్ర పరాయణం మేలు చేస్తుంది.

Also Read: శివుడిని బిల్వ పత్రాలతో ఎందుకు పూజిస్తారు ? సోమవారం బిల్వనీటితో అభిషేకం చేయడానికిగల అంతర్యం..

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్