Yadadri Collectorate: ఆ జిల్లా కలెక్టరేట్‌కు వెళ్ళాలంటే చేతిలో కర్ర ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా..?

సాధారణంగా పోలీసు, రక్షణ, బ్యాంక్ కార్యాలయాలకు పోలీసులు పహారా కాస్తుంటారు. కానీ ఇది అడవి కాదు.. ధర్నా అసలే కాదు. తిరుపతి అలిపిరి మెట్ల మార్గం అంతకంటే కాదు. కానీ ఇక్కడ జిల్లా ప్రభుత్వ కార్యాలయానికి సిబ్బంది కట్టెలతో పహారా కాస్తున్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

Yadadri Collectorate:  ఆ జిల్లా కలెక్టరేట్‌కు వెళ్ళాలంటే చేతిలో కర్ర ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Monkeys In Collectorate
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 05, 2024 | 12:15 PM

సాధారణంగా పోలీసు, రక్షణ, బ్యాంక్ కార్యాలయాలకు పోలీసులు పహారా కాస్తుంటారు. కానీ ఇది అడవి కాదు.. ధర్నా అసలే కాదు. తిరుపతి అలిపిరి మెట్ల మార్గం అంతకంటే కాదు. కానీ ఇక్కడ జిల్లా ప్రభుత్వ కార్యాలయానికి సిబ్బంది కట్టెలతో పహారా కాస్తున్నారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

కోతి వనంలో ఉంటేనే వానర చేష్టలకు అందం. ఆ కోతి జనావాసాల్లోకి వచ్చి చేసే పనులు వికృత చేష్టలుగా మారుతున్నాయి. వనం వీడి జనంలోకి వచ్చిన కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోతుల గుంపు ఇళ్లలోకి చొరబడి అందినకాడికి తీసుకెళ్తున్నాయి. తినే వస్తువులు కనిపిస్తే అంతే సంగతులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. ఇపుడు ఈ కోతుల బెడద యాదాద్రి జిల్లా కలెక్టరేట్ కు తాకింది.

భువనగిరి శివారు పగిడిపల్లిలోని యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌కు నిత్యం వందలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, సామాన్యులు వస్తూ పోతుంటారు. పట్టణ శివారులోని జిల్లా కలెక్టరేట్ వద్ద కోతులు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో కలెక్టరేట్ సిబ్బంది, ఉద్యోగులు ఇక్కడికి వచ్చే సామాన్యులు కోతులతో బెంబేలెత్తుతున్నారు. కార్యాలయంలో లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్నా ఉద్యోగులు, సిబ్బంది జంకుతున్నారు. మహిళ ఉద్యోగులైతే కోతులను చూసి తమ కార్యాలయ తలపులను మూసి వేస్తున్నారు.

జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని వరండాల్లో కోతులు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎవరి చేతిలో ఏదైనా కనిపిస్తే చాలు మాయం చేస్తున్నాయి. ఈ కోతులు ఎటువైపు నుంచి వచ్చే దాడి చేస్తాయోనని భయంతో ఉద్యోగులు, సిబ్బంది వణికిపోతున్నారు. దీంతో కార్యాలయ సిబ్బంది చేతి కర్ర ఉంటేనే బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు, సిబ్బంది కర్రలు చేత పట్టుకొని కోతులను తరముతున్నారు. కలెక్టరేట్ వద్ద కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ అధికారులకు ఉద్యోగులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లోని కోతుల బెడద అంటే పట్టని అధికారులకు.. ఇప్పుడు కార్యాలయాలకు తాకడంతో తెలుస్తోందని సామాన్యుల అనుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…