AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? అయితే ములక్కాయ ఆకులను ఇలా వాడితే జుట్టు సమస్యలు దూరం.. ఎలాగంటే..

చిన్నా, పెద్ద ఇలా వయసుతో సంబంధం లేకుండా.. ఇప్పుడు అందరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం.. ఈ సమస్య క్రమంగా మానసికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది.

Hair Care: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? అయితే ములక్కాయ ఆకులను ఇలా వాడితే జుట్టు సమస్యలు దూరం.. ఎలాగంటే..
Drumstick Leaves
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2021 | 9:02 PM

Share

చిన్నా, పెద్ద ఇలా వయసుతో సంబంధం లేకుండా.. ఇప్పుడు అందరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం.. ఈ సమస్య క్రమంగా మానసికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది. జుట్టు రాలిపోతున్న కొద్ది చాలా మంది నిరాశకు గురవుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక రకాలు నూనెలు, షాంపులు ఉపయోగిస్తుంటారు. అయితే ఫలితం మాత్రం శూన్యంగా మిగిలిపోతుంది. చివరకు వైద్యులను సంప్రదించి.. కెమికల్ సప్లిమెంట్స్ తీసుకునే స్థాయికి చేరుకుంటారు. కానీ మన చుట్టూ ఉండే సహజ వనరులలో ఎన్నో పోషకాలున్నాయి. అలాగే సహజంగా లభించే పదార్థాలతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తగ్గించవచ్చని చాలా వరకు తెలియదు. ముఖ్యంగా ములక్కాయ ఆకులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎక్కువగా సహాయపడతాయి. కేవలం ఇవే కాకుండా.. జుట్టు సమస్యలను కూడా ఈ ములక్కాయ ఆకులు తగ్గిస్తాయి. అయితే వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా.

అరకప్పు ములక్కాయ ఆకులను పేస్ట్ గా చేసుకోవాలి. అందులోనే బాదం నూనె 2 టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ కాక్టస్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లపై మర్దనా చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు రెండు మూడు సార్లు చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. ఇవే కాకుండా ములక్కాయ ఆకులతో టేబుల్ స్పూన్ నెయ్యి, టేబుల్ స్పూన్ కాక్టస్ వేసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేస్తే జుట్టుకు పోషకాలు అందుతాయి.

ఇవే కాకుండా.. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని కూరగాయలను కూడా ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉండాలి. పాలకూర ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది. ఇది ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఐరన్, జింక్, ఇతర ఆవశ్యక విటమిన్లు లభిస్తాయి. అలాగే క్యారెట్ కూడా జుట్టు మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ బీ 7 పుష్కలంగా ఉంటుంది. దీనిని హెయిర్ ప్యాక్ గా తీసుకుంటే జుట్టు దృడంగా ఉంటుంది. ఇవే కాకుండా.. ఉల్లిపాయ కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇందులో జింక్, ఐరన్, బయోటిన్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి జుట్టు బలంగా అయ్యేలా చేస్తాయి. పచ్చి బఠానీలో విటమిన్ ‘సి’ ఎక్కువగా లభిస్తుంది. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. గుమ్మడి, అవిసె గింజలు సైతం కురులు దృఢంగా మారడానికి తోడ్పడతాయి. వీటిలో విటమిన్ ఇ, విటమిన్ బి, మెగ్నీషియం, జింక్, కాపర్‌తో పాటుగా ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా లభ్యమవుతాయి. వీటిని రోజూ ఆహారంగా తీసుకొంటే.. జుట్టు రాలే సమస్య పూర్తిగా నయమవుతుంది.

Also Read: ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన ప్రాంతాలు… కానీ అక్కడికి వెళ్లేందుకు పర్యాటకులకు అనుమతి లేదు.. ఎందుకంటే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

ఆ దర్శకుడికి కోరుకున్నది ఇస్తే లక్ష రూపాయాలిస్తారట.. వెంటనే బిల్డింగ్ మీద నుంచి… షాకింగ్ విషయాలను చెప్పిన హీరోయిన్..