Monsoon Health Tips: వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
వర్షం అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. కానీ వర్షాకాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే బాధిస్తుంటాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఇతర
వర్షం అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. కానీ వర్షాకాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే బాధిస్తుంటాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఇతర అనారోగ్య సమస్యలు ఈ సీజన్లో తీవ్రంగా ఇబ్బందిపెడతాయి. ఇక ప్రస్తుత కరోనా కాలంలో ఈ సీజనల్ వ్యాధుల బారిన పడ్డారంటే అంతే సంగతులు. వర్షాకాలంలో వచ్చే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే.. ముందుగు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తప్పనసరిగా తీసుకోవాలి.
వర్షాకాలంలో ఇంటి చుట్టూ ఉండే వ్యర్థాల వలన చెడు వాసనలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఇంటిని ఎప్పుడూ సువాసనభరితంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి.. అందులో కొన్ని చుక్కల లావెండర్, శాండల్ వుడ్ ఆయిల్ వేసి హాలులో ఓ పక్కన పెట్టాలి. దాని నుంచి వచ్చే సువాసనతో ఇంటిల్లిపాది ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఇంట్లోకి వెలుతురు చాలా అవసరం. ఎండ ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు తెరచి ఇంట్లోకి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఎప్పుడూ కిటికీలు, తలుపులు మూసి ఉంచడం వలన ఇంట్లో చెమ్మగా ఉంటుంది. అలాగే చెడు వాసనలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇంట్లో వాడే డోర్ మ్యాట్స్ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
ముఖ్యంగా ఈ కాలంలో వంటిల్లు అత్యంత శుభ్రంగా ఉండాలి. పాత్రలలో నిళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఎప్పుడూ దుమ్ము ఉండే ప్రదేశాల్లో పాత్రలను పెట్టకూడదు. భోజనం చేసే ముందు వాటిని శుభ్రం చేయడం చేస్తూ ఉండాలి. వంటింట్లో డస్ట్ బిన్ ఉంచకూడదు. ఎందుకంటే.. దానిపై ఉండే ఈగలు, దోమలు ఆహారం పై కూడా వాలుతుంటాయి. ఇక ఇంట్లో వాడే దుప్పట్లను ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఆరవేయాలి. ఇలా చేయడం వలన చెమ్మగా ఉండవు. తలగడ కవర్లు కనీసం వారానికి ఒకసారి మార్చి, ఉతికినవి వేయాలి. లేదంటే జుట్టు మురికి, శరీరానికి ఉండే మృతకణాలు వాటికి అంటుకొని బ్యాక్టీరియా ఆవాసాలుగా మారతాయి. వాడిన తువ్వాళ్లను ఇంట్లో కాకుండా, బాల్కనీలో గాలి లేదా ఎండ ఉండేచోట ఆరనివ్వాలి. సిల్కు కర్టెన్లు వాడితే గది వెచ్చగా ఉంటుంది. ఉతికిన దుస్తులను బాగా ఆరిన తర్వాతే కప్‌బోర్డులో ఉంచాలి.