AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలకిక చరమగీతం.. లైసెన్స్ పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్స్‌, అడ్రస్ చేంజ్ వంటివన్నీ ఇక మేడ్ ఈజీ

Driving License now very easy : కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రాబోయే కొన్ని నెలల్లో డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన..

డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలకిక చరమగీతం.. లైసెన్స్ పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్స్‌, అడ్రస్ చేంజ్ వంటివన్నీ ఇక మేడ్ ఈజీ
Venkata Narayana
|

Updated on: Feb 27, 2021 | 8:43 PM

Share

Driving License now very easy : కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రాబోయే కొన్ని నెలల్లో డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన అన్ని సంబంధిత సేవలను ఆన్‌లైన్‌లో చేయబోతోంది. యుపి, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో 90 శాతానికి పైగా సేవలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. ఇకిప్పుడు.. మార్చి నుండి, దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో దాదాపు అన్ని సేవలు ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతాయి. మోడీ సర్కారు సూచనల మేరకు దేశంలోని అన్ని రవాణా కార్యాలయాల (ఆర్టీఓ) పనులు క్రమంగా ఆన్‌లైన్‌లోకి మారిపోతున్నాయి. అన్ని రకాల డ్రైవింగ్ లైసెన్సులు, పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్స్‌తో పాటు చిరునామా మార్పు ఇంకా ఆర్‌సి కోసం ప్రజలు పదే పదే ఆర్టీఓ ఆఫీసుకు రావాల్సిన అగత్యం లేకుండా రవాణా శాఖ ప్రయత్నిస్తోంది. హాయిగా ఇంట్లో కూర్చునే ఆయా వ్యక్తులు ఈ పత్రాలను అప్‌లోడ్ చేసి, పరీక్షలు ఇవ్వడానికి మాత్రమే ఆర్టీఓ కార్యాలయానికి రావాలి.

ఆన్‌లైన్ లో వివరాలు సబ్మిట్ చేసిన తరువాత, అభ్యర్థులు డ్రైవింగ్ టెస్ట్, ఫిట్‌నెస్ కోసం మాత్రమే ఆర్టీవో ఆఫీస్‌కి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీఐపీ నంబర్ నమోదు ప్రక్రియ కూడా సులభమవుతుంది. ఈ ప్రక్రియ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా రవాణా అధికారులు చేస్తున్న చాలా సేవలు గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో ప్రారంభించబడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్. రాజస్థాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు లెర్నింగ్ లైసెన్స్‌లు నమోదు కోసం కొత్త నిబంధనలను అమలు చేశాయి. అదే సమయంలో, కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండింటిలోనూ దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి, అయితే దాదాపు అన్ని సేవలు మార్చి నెల నుండి ఆన్‌లైన్‌లో ఉంటాయి.

అంతేకాదు, డిఎల్ ఫీజును చెల్లించే విధానంలోనూ విశేషమైన మార్పులు తెచ్చారు. లెర్నింగ్ లైసెన్స్ కోసం ఫీజులను జమ చేసే విధానంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మార్పు చేసింది. ఇప్పుడు తెచ్చిన కొత్త స్మార్ట్ వ్యవస్థ ప్రకారం, స్లాట్ బుక్ అయిన వెంటనే సదరు అభ్యర్థి లెర్నింగ్ లైసెన్స్ కోసం డబ్బు జమ చేయాలి. డబ్బు జమ అయిన వెంటనే, మీకున్న వెసులుబాటు, సౌలభ్యం ప్రకారం పరీక్షా పరీక్ష తేదీ కూడా ఎంచుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా ప్రతీ చిన్నపనికి కార్యాలయాల చుట్టుముట్టడం వంటి అవస్థలు జనాలకు తగ్గుతాయి.

ఇలా.. డ్రైవింగ్ లైసెన్స్ సహా మిగతా సేవలకు ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అగత్యం తప్పుతుంది. ఏదైనా లైసెన్స్ సంబంధిత సేవలకు, ఆశావహులు రవాణా శాఖ యొక్క వెబ్‌సైట్‌కు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ సేవలపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ఫారమ్‌ను నింపేటప్పుడు, మీ డిఎల్ నంబర్‌తో పాటు మరింత వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి. దీనితో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన పత్రాలను కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్టీఓ కార్యాలయంలోని బయోమెట్రిక్ వివరాలను పరిశీలించిన తరువాత, మీ అన్ని పత్రాలు ధృవీకరించబడతాయి. దీని తరువాత మీ లైసెన్స్ పునరుద్ధరించబడుతుంది.

Read also : PlayBack Pre Release Event Live : “ప్లేబ్యాక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్, స్పందన, అనన్య సందడే సందడి