Shankhpushpi : నీలి రంగు శంకు పువ్వు దేవుని పూజలోనే కాదు.. ఆరోగ్యానికి కూడా దివ్యమైన ఔషధం ఎలానంటే.. !

శంఖపుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో.. అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. మన పూర్వికులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు. ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో కూడా...

  • Surya Kala
  • Publish Date - 8:37 pm, Sat, 27 February 21
Shankhpushpi : నీలి రంగు శంకు పువ్వు దేవుని పూజలోనే కాదు.. ఆరోగ్యానికి కూడా దివ్యమైన ఔషధం ఎలానంటే.. !

Shankhpushpi: శంఖపుష్పం పుష్పించే మొక్కల్లో ఫాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతి కి చెందిన మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు. విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదవది. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి. తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది. తమిళం, తెలుగు, మళయాళం భాషలలో దీని పేరు శంఖం నుండి వచ్చింది. అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో.. అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందట

ఈ పువ్వులు నీలి రంగు,తెలుపు రంగులో ఉంటాయి. శంఖు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకొనే మొక్కగానే మనలో చాలా మందికి తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు.

అయితే ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు. మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధన అనంతరం మళ్ళీ ఆరోగ్యానికి శంఖం పుష్పం ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక శంఖు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను, టీగాను ఎక్కువగా ఉపయోగించటం వలన బాగా పాపులర్ అయింది. శంఖు మొక్క పువ్వులే కాకుండా వేరు, కాండం, ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు.

* శంఖు పూలు, ఆకులు, వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపకశక్తిని పెంచటంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది. శంఖు పువ్వుల్లో ఉండే ఆర్గనేల్లోలిన్ అనే పదార్ధం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది.

* నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా మంచి ముందుగా పనిచేస్తుంది.

* ఆమ్లాన్ని తొలగించే యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలన నయం చేస్తుంది.

* ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంఖు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుని కలిపి రుబ్బి.. ఆ వాపు పై పెట్టి కట్టు కడితే.. వాపు తగ్గుతుంది.

* దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు

* దీని వేరు విరేచనకారి, మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును.

* శంఖు పువ్వులో ఉండే ప్రోయంతోసైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా గ్లకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది.

* శంఖు పువ్వులో ఉండే క్యూయెర్సిటిన్ అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా చేస్తుంది.

* చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది.
* ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

* మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖుపువ్వులు సూపర్‌గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతాన లేమి, యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే శంఖుపువ్వులను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమలచ్చు. లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంఖు మొక్కలో ఏ బీగాన్ని అయినా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి త్రాగవచ్చు. ఒక గ్లాసుడు నీటిలో ఐదు నీలపు శంఖుపువ్వులను వేసి పది నిమిషాల పాటు నాన బెట్టి.. ఆ నీటిని తేనెతో కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ పానీయాన్ని మాసానికి ఒకసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

నీలం రంగులో ఉండే శంఖు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ గా అనేక రకాల స్వీట్స్, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్‌లో రాయల్ ఫుడ్స్‌లో దీనిని ఎక్కువుగా వాడుతున్నారు.

మన పూర్వికులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు. ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో కూడా ఈ విషయం నిరూపణ అయింది.

Also Read:

 వెల్లుల్లి, ఉల్లిపాయల్లో మొలకలు వస్తే ఏం చేయాలి..? మొలకలు వచ్చినవి తింటే మంచిదేనా..?

 భారత దేశంలో చరిత్రలో కనుమరుగైన అద్భుత నగరాలు.. నేటికీ అవి మన విజ్ఞానానికి సజీవ సాక్ష్యాలు