Garlic, Onions: వెల్లుల్లి, ఉల్లిపాయల్లో మొలకలు వస్తే ఏం చేయాలి..? మొలకలు వచ్చినవి తింటే మంచిదేనా..?

Garlic, Onions: ఉల్లి, వెల్లుల్లి ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండేది. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయని అందరికి తెలిసిందే. వీటిని ఎక్కుగా ఉపయోగించడం వల్ల..

Garlic, Onions: వెల్లుల్లి, ఉల్లిపాయల్లో మొలకలు వస్తే ఏం చేయాలి..? మొలకలు వచ్చినవి తింటే మంచిదేనా..?
Follow us

|

Updated on: Feb 27, 2021 | 8:13 PM

Garlic, Onions: ఉల్లి, వెల్లుల్లి ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండేది. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయని అందరికి తెలిసిందే. వీటిని ఎక్కుగా ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏ వంటకం చేయాలన్న ముందుగా నూనెలో ఉల్లిపాయలు వాడాల్సిందే. ఇవి కూరల్లో ఎంతో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదే. వీటిలో విటమిన్‌ -సి, విటమిన్‌ బి6, పోటాషియం, ఫోలేట్‌ వంటివి ఉన్నాయి. వెల్లుల్లిలో వీటితో పాటు క్యాల్షియం, ఫాస్పరస్‌, కాపర్‌, మెగ్నీషియం వంటివి అధిక మోతాదులో ఉంటాయి. కానీ ఇలా మన కిచెన్ లో స్టోర్ చేసిన ఉల్లి, వెల్లుల్లి మొలకలు రావడం మనం చాలా సార్లు గమనించే ఉంటాం. కొందరైతే ఆ మొలకల మేరకు కట్ చేసి వాటిని ఉపయోగించుకుంటే.. మరికొందరు వాటిని ఉపయోగించాలా? వద్దా? అన్న అనుమానాలు వస్తుంటాయి. మరి, మొలకలు వచ్చిన ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించడం మంచిదేనా? తెలుసుకుందాం.

మామూలుగా మనం నేలలో నాటందే చాలా వరకూ మొక్కలు మొలకెత్తవు. కానీ ఉల్లి, వెల్లుల్లి మాత్రం ఎక్కడున్నా మొలకలు వస్తుంటాయి. నేలలో లేపోయినా వాటిని అలాగే ఉంచేస్తే ఆ మొలకలు పొడవుగా పెరుగుతాయి. దీనికి కారణం మన కిచెన్ లో ఉండే తేమ వాతావరణమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఉల్లి, వెల్లుల్లి మొలకెత్తేందుకు కాస్త తేమ వాతావరణం ఉంటే సరిపోతుందని అంటున్నారు. తమలో ఉన్న శక్తిని, పోషకాలను ఉపయోగించి తామే పెరుగుతాయి. ప్రత్యేకంగా నేలలో నాటకపోయినా.. ఇలా మొలకెత్తడం అనేది వాటిలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇలా మొలకెత్తడం వల్ల వాటిలో ఎలాంటి టాక్సిన్లు విడుదల కావు. కానీ అవి కాస్త జిగురుగా పాడయిపోయినట్లుగా మారిపోవచ్చు.

ఇలాంటప్పుడు కాస్త పాడైన భాగాన్ని తొలగించి మంచిగా ఉన్న భాగాన్ని ఉపయోగించుకుంటాము. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మొలకలు అప్పుడప్పుడే వస్తున్నాయి అనిపించినప్పుడే అలాంటివాటిని పక్కకి ఉంచి ముందు వాటిని వాడేయడం వల్ల అవి పాడవక ముందే వాడే వీలుంటుంది. మొలకలు పెద్దగా అవుతున్న కొద్దీ ఉల్లి లేదా వెల్లుల్లిపాయలు కుళ్లడం మనం చూస్తూనే ఉంటాము. ఇలా కుళ్లిపోయిన వాటిని పడేయడం తప్ప ఇంకేమీ చేయలేం. చాలామందికి ఈ మొలకల రుచి చాలా ఇష్టం. అందుకే మొలకలు వచ్చే వరకూ ఆగి ఆ తర్వాత తింటుంటారు. అయితే ఈ మొలకలతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ మొలకల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవడం కూడా మంచిదేనని వెల్లడిస్తున్నారు. అయితే ఈ మొలకలు నేరుగా తింటే కాస్త చేదుగా అనిపించవచ్చు. అందుకే ఉల్లి, వెల్లుల్లి ముక్కలతో పాటు కూరల్లో వేసుకొని తినడం మంచిది.

సాధారణంగా వంటింట్లో ఉండే తేమ కారణంగా మొలకలు వస్తుంటాయి. ఇలా కాకుండా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచినట్లయితే మొలకలు రాకుండా ఉంటాయి. వాటికి గాలి తగిలేలా కూడా చూసుకోవాలి. అవి పండుతున్నప్పుడు విడుదలయ్యే ఇథలిన్ వల్ల కూడా ఉల్లిపాయలు మొలకెత్తుతాయి. వీలైతే మంచాల కింద లేదా అటక మీద వీటిని భద్రపర్చుకోవడం వల్ల మొలకలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

శరీరానికి ఎంతో మేలు చేసే పదార్థాలు.. ఇవి క్రమంగా తీసుకుంటే వాటిని నుంచి తప్పించుకోవచ్చు

Immunity: రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు

మీరు రోజూ మందు కొడతారా! అయితే కాకరకాయను తినాల్సిందే.. లేదంటే ఏం జరుగుతుందో తెలిస్తే భరించలేరు.

గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
స్మార్ట్‌ఫోన్‌ వాడే పిల్లల్లో ఆ సమస్య అధికం.. పరిశోధనల్లో వెల్లడి
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మాములుగా లేదుగా మీ ఫెర్మార్మెన్స్..
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం 16 అవసరమా? అసలు ఫారం 16లో ఏముంటుంది?
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫారం 16 అవసరమా? అసలు ఫారం 16లో ఏముంటుంది?
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక