Indian Railway: రైల్వే ప్రయాణికులకు గమనిక..! టికెట్‌తో పాటు ఈ సదుపాయం ఉందని మీకు తెలుసా..?
Indian Railway: భారతీయ రైల్వే ప్రయాణీకులకు టికెట్ రిజర్వేషన్‌తో పాటు చాలా సౌకర్యాలను అందిస్తుంది. రిజర్వ్
Indian Railway: భారతీయ రైల్వే ప్రయాణీకులకు టికెట్ రిజర్వేషన్‌తో పాటు చాలా సౌకర్యాలను అందిస్తుంది. రిజర్వ్ చేసిన టికెట్‌పై ఇన్సూరెన్స్ కవరేజి ఉంటుంది. ప్రయాణికులలో చాలామందికి ఈ విషయం గురించి తెలియదు. మీరు రైల్వే టిక్కెట్‌పై బీమా రక్షణ ఎలా ఎంచుకోగలరో దాని ప్రయోజనాన్ని ఎలా పొందగలరో తెలుసుకోండి.
10 లక్షల వరకు పరిహారం ఇండియన్ రైల్వేస్ అనుబంధ సంస్థ అయిన IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకుంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా అనే ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని టిక్ చేయాలి. అప్పుడు మీరు రైలు ప్రమాదంలో మరణించినా లేదా తాత్కాలికంగా వికలాంగులయినా మీకు రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. శాశ్వత పాక్షిక వైకల్యం ఉన్నట్లయితే రూ.7.5 లక్షలు లభిస్తాయి.ప్రమాదం కారణంగా ప్రయాణీకుడు ఆసుపత్రిలో చేరాల్సి వస్తే చికిత్స కోసం రూ.2 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. మీరు టికెట్ బుక్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా అడుగుతారు. మీరు క్లిక్ చేస్తే మీకు ఈ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది.
సెప్టెంబర్ 2018 నుంచి మార్పులు IRCTC ద్వారా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే కస్టమర్లందరికీ ఈ సదుపాయం తప్పనిసరిగా అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 2018 నుంచి దీనికి కనీస ఛార్జీ విధిస్తున్నారు. టికెట్ బుక్ చేసే సమయంలో కస్టమర్‌లు దాని కోసం ఎంచుకునే అవకాశం కల్పించారు. ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం 50 పైసల కంటే తక్కువే కాబట్టి టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ఎంపికను ఎంచుకోవడం మంచిది. ఇది కాకుండా రైలు ప్రయాణంలో మీ ఆరోగ్యం క్షీణిస్తే, మీరు TTE నుంచి ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని అడగవచ్చు. ఉచిత వైఫై సౌకర్యం కూడా పొందవచ్చు.