Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beggars Bank: బిచ్చగాళ్ల బ్యాంకు గురించి మీకు తెలుసా..! కేవలం వన్‌ పర్సెంట్ ఇంట్రెస్ట్‌కే రుణాలు..?

Beggars Bank: SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్, HDFC బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్

Beggars Bank: బిచ్చగాళ్ల బ్యాంకు గురించి మీకు తెలుసా..! కేవలం వన్‌ పర్సెంట్ ఇంట్రెస్ట్‌కే రుణాలు..?
Beggars Bank
Follow us
uppula Raju

|

Updated on: Sep 27, 2021 | 9:23 PM

Beggars Bank: SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్, HDFC బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ ఇలా దేశంలో 42 కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. కానీ బిచ్చగాళ్ల బ్యాంకు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? అవును ఇది నిజం మీరు విన్నది నిజమే. బిచ్చగాళ్ల బ్యాంకు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉంది. కొంతమంది బిచ్చగాళ్లు కలిసి దీనిని ప్రారంభించారు. ఇప్పుడు ఈ బ్యాంకు డిపాజిట్లు, విత్‌ డ్రాలు, వడ్డీతో పాటు ఖాతాదారులకు రుణాలు కూడా మంజూరు చేస్తుంది.

యాచిస్తూ ఉండేవారికి బ్యాంకేంటని షాక్ అయి ఉంటారు. కానీ బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కొంతమంది యాచకులు దీనిని స్వయం సహాయక బృందంగా ప్రారంభించి దానికి బిఖారి బ్యాంక్ అని పేరు పెట్టారు. బిచ్చగాళ్లు 5 గ్రూపులుగా ఏర్పడి ఈ బ్యాంకుని నడుపుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని 175 మంది యాచకులు తమ అవసరాలను తీర్చడానికి, భవిష్యత్తులో ఇబ్బందులను నివారించడానికి ఐదు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఈ బ్యాంకుని ప్రారంభించారని తెలిసింది.

70 శాతం సభ్యులు మహిళలు ప్రస్తుతం ముజఫర్‌పూర్ జిల్లాలో 175 మంది యాచకులు ఈ స్వయం సహాయక సంఘాలతో సంబంధం కలిగి ఉన్నారు. ఇందులో 70 శాతం మంది సభ్యులు మహిళలే. భిక్షాటన ద్వారా సంపాదించిన సొమ్మంతా వారు ఈ బ్యాంకులో జమ చేస్తారు. వాటిపై వడ్డీని కూడా పొందుతారు.

1% వడ్డీకే రుణాలు ఈ బ్యాంకు సభ్యులు అవసరమైనప్పుడు రుణాలు పొందుతారు. అది కూడా కేవలం ఒక శాతం వడ్డీకే. నివేదికల ప్రకారం ఈ స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న అవసరమైన సభ్యులకు మూడు నెలల పాటు 1 శాతం చొప్పున రుణాలు ఇస్తారు. ఈ బ్యాంకుకి సంబంధించి మొబైల్ యాప్ కూడా ఉంది. ఇందులో బిచ్చగాళ్ల సభ్యుల డేటా ఉంటుంది. ముజఫర్‌పూర్ జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ బిచ్చగాళ్లు చేపట్టిన ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిందని తెలిపారు.

Telangana: గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు..

Indian Railway: రైల్వే ప్రయాణికులకు గమనిక..! టికెట్‌తో పాటు ఈ సదుపాయం ఉందని మీకు తెలుసా..?

NEET PG 2021: యువ వైద్యులను ఫుట్‌బాల్‌గా భావించకండి.. కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం!