AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Returns: మీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఇతర ఆదాయాలను తప్పనిసరిగా చూపించాలి.. లేకపోతే చిక్కులు తప్పవు!

మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ (income tax returns) దాఖలు చేస్తున్నారా? అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

IT Returns: మీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఇతర ఆదాయాలను తప్పనిసరిగా చూపించాలి.. లేకపోతే చిక్కులు తప్పవు!
It Returns
KVD Varma
|

Updated on: Sep 27, 2021 | 9:30 PM

Share

IT Returns: మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ (income tax returns) దాఖలు చేస్తున్నారా? అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో కొన్ని విషయాలను మర్చిపోవడం కానీ, ఆ ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వహించడం కానీ చేస్తాము. కొన్ని ఆదాయాలను రిటర్న్స్ లో చూపించము. కానీ, అది తరువాత చాలా చిక్కులు తెచ్చి పెడుతుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ వేసే సమయంలో ప్రతి అంశాన్ని ఒకటికి పదిసార్లు పరిశీలించుకుని దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తున్నప్పుడు, పన్ను చెల్లింపుదారుడు ఆదాయాన్ని మొత్తం అందులో పేర్కొన్నట్లు నిర్ధారించుకోవాలి. యజమాని జీతం సర్టిఫికేట్ (ఫారం -16) కాకుండా, ఇతర మూలాల నుండి వచ్చే ఆదాయాన్ని గురించి కచ్చితంగా వెల్లడించాలి.   మీరు ఏదైనా ఆదాయ వనరుని దాచిపెడితే, మీరు పభుత్వం నుంచి తప్పించుకోలేరు. కచ్చితంగా దాని విషయంలో ఎప్పుడైనా సరే  ఆదాయపు పన్ను శాఖ నోటీసును ఎదుర్కోవలసి రావచ్చు. 

వాస్తవానికి, ప్రతి పన్ను చెల్లింపుదారుడి ప్రతి ప్రధాన లావాదేవీకి సంబంధించిన చాలా సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ దగ్గర ఉంటుంది.  పన్ను చెల్లింపుదారు ఆదాయానికి సంబంధించిన వివరాలను అందించిన వెంటనే, ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ఆ సమాచారమంతా డిపార్ట్‌మెంట్‌లో అందుబాటులో ఉన్న సమాచారంతో బేరీజు వేస్తుంది. ఆర్ధిక నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. ఇందులో ఏమైనా తేడా కనిపిస్తే, ఆ శాఖ నోటీసు జారీ చేసి విచారించవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ వద్ద ఈ సమాచారం ఉంటుంది..

1. బ్యాంకు లేదా పోస్టాఫీసు పొదుపు ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లు.

2. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు:

  • ఒక ఆర్థిక సంవత్సరంలో రూ .2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు.

3. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ .2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి.

4. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బాండ్లు లేదా డిబెంచర్లలో పెట్టుబడి.

5. రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ షేర్-ఐపిఒలో చేసిన పెట్టుబడులు.

6. రూ .30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్థిర ఆస్తుల కొనుగోలు.

7. లిస్టెడ్ సెక్యూరిటీలు లేదా మ్యూచువల్ ఫండ్స్ అమ్మకం ద్వారా మూలధన ఆదాయం.

8. కంపెనీల నుండి పొందిన డివిడెండ్ నుండి ఆదాయం.

9. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలలో డిపాజిట్లపై వడ్డీ నుండి ఆదాయం.

10. ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విదేశీ మారకం కొనుగోలు.

11. రూ .2 లక్షలకు మించి ఏదైనా వస్తువు నగదు కొనుగోలు.

12. బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్‌లు / పే ఆర్డర్లు / బ్యాంకర్స్ చెక్కులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు రూపంలో డ్రా చేసినా ఆ వివరాలు.

ITR దాఖలు చేయడానికి ముందు వీటిని గుర్తుంచుకోండి

1. ఫారం 26AS లో చూపిన మొత్తం ఆదాయం రిటర్న్‌లో చూపించాము.

2. TDS ధృవపత్రాలు, ఫారం 26AS  TDS సంఖ్య సరిదిద్డడం జరిగింది.

3. ఆస్తి, ఆభరణాలు, పెయింటింగ్‌లు మొదలైన వాటి అమ్మకం ద్వారా వచ్చే మూలధన లాభాలు ప్రస్తావించడం జరిగింది.

4. ఆర్థిక సంవత్సరంలో చేసిన అర్హత కలిగిన పెట్టుబడులకు పూర్తి మినహాయింపు తీసుకోవడం జరిగింది.

5. డివిడెండ్ ఆదాయం పై ఇప్పుడు పన్ను పరిధిలోకి వస్తుంది.  అలాంటి ఆదాయం ఇతర వనరుల ఆదాయంలో చూపించడం జరిగింది. 

6. మినహాయింపు ఆదాయం అంటే పన్ను రహిత ఆదాయ సమాచారం ఇవ్వడం జరిగింది. 

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటపుడు ఈ అంశాలను సరిచూసుకోవాల్సి ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

Also Read: Building Collapsed: హమ్మయ్య.. అంతా సేఫ్.. ఇలా బయటకు వచ్చారో లేదో కూలింది..

SRH vs RR IPL 2021 Records: పోటీలో ఇరు జట్లు సమమే.. నేడు హోరాహోరీ పోరు గ్యారెంటీ.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?