Speech Therapy: పక్షుల మెదడు సంకేతాలతో మూగవారు వారి భావాలు స్పష్టంగా వివరిస్తారు.. ఎలాగంటే..
మూగవారికి తిరిగి గొంతును ఇవ్వడం కష్టం కానీ, వారి భావాలను స్పష్టంగా వ్యక్తపరిచే విధానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం ఓ పక్షి సహాయ పడుతుండటం విశేషం.
Speech Therapy: మూగవారికి తిరిగి గొంతును ఇవ్వడం కష్టం కానీ, వారి భావాలను స్పష్టంగా వ్యక్తపరిచే విధానం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం ఓ పక్షి సహాయ పడుతుండటం విశేషం. ఎలాగంటే.. దీని కోసం, జీబ్రా పక్షి మెదడు సిగ్నల్ ఉపయోగిన్చానున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం, మాట్లాడలేని వ్యక్తులు ఒక నిర్దిష్ట రకం పక్షి యొక్క మెదడు సంకేతాల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ విధానం ద్వారా ఇప్పుడు శాస్త్రవేత్తలు సిగ్నల్స్ ద్వారా చెవిటి/ మూగ వారు కూడా తమ భావాలను వ్యక్తపరిచే పరికరాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఫీట్ చేశారు. జీబ్రా అనే పక్షులపై దీని పరీక్ష జరిగింది.
సిలికాన్ ఇంప్లాంట్ల సహాయంతో సంకేతాల రికార్డు..
మగ జీబ్రా పక్షి పాడుతున్నప్పుడు, శాస్త్రవేత్తలు దాని మెదడు సంకేతాలను సిలికాన్ ఇంప్లాంట్ల సహాయంతో రికార్డ్ చేశారు. అప్పుడు కృత్రిమ మేధస్సు సహాయంతో పక్షి తరువాత ఏ పాట పాడవచ్చో అంచనా వేశారు. ఈ విధంగా అంచనా వేయడం ద్వారా, మాట్లాడలేని వ్యక్తుల మనస్సును అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది టెక్నాలజీని ఒక పరికరంగా మార్చడానికి, వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి అనుమతిస్తుందాని వారంటున్నారు.
సాంకేతికత రోగులకు ‘కొత్త వాయిస్’ అవుతుంది.
ప్రస్తుతం ప్రజల గొంతులను వినగల, వాటిని పదాలుగా అనువదించే ఆర్ట్ ఇంప్లాంట్లు ఉన్నాయి. కానీ, ఈ కొత్త టెక్నాలజీ వారి మెదడును అర్థం చేసుకుని వారికి ‘కొత్త స్వరం’ ఇస్తుంది.
పరిశోధకుడు డారిల్ బ్రౌన్ పక్షుల మెదడు సంకేతాలు మాట్లాడలేని వ్యక్తులకు కొత్త మార్గాన్ని చూపించాయి. మేము మానవ సంభాషణను అర్థం చేసుకోవడంలో సహాయపడే పక్షి పాటలను అధ్యయనం చేస్తున్నమంటూ చెప్పారు.
పక్షులు మానవులకు ఎలా సహాయపడతాయో
పరిశోధకులు పక్షులు పాడే విధానం, మానవ స్వరం మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. అలాగే- ఇద్దరూ నెమ్మదిగా నేర్చుకుంటారు. ఇతర జంతువుల శబ్దాల కంటే ఇది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. పరిశోధన సమయంలో చేసిన ప్రయోగాల ద్వారా, మెదడును అర్థం చేసుకోవడం ద్వారా, దాని ధ్వనిని ఎలా తయారు చేయవచ్చో తెలుసుకోగలిగారు.
Also Read:
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అరియానా.. ఏం చెప్పిందంటే..
Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్‌పై మండిపడుతున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..