AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కడో రాసి పెట్టి ఉంది భయ్యా.. టూత్‌పేస్ట్ తిని బతికిన యువకుడు.. ఆ 10 రోజులు ఏం జరిగిందంటే!

చైనాలోని మంచు పర్వతాలలో తప్పిపోయిన ఒక హైకర్ గురించి చైనా నుండి ఒక కథనం వెలువడింది. అయితే, అక్కడ అతను తన ప్రాణాలను కాపాడుకున్న విధానం నిజంగా ప్రశంసనీయం. ఆ 17ఏళ్ల యువకుడి ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చివరికి రెస్క్యూ బృందం అతికష్టం మీద క్షేమంగా రక్షించడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

ఎక్కడో రాసి పెట్టి ఉంది భయ్యా.. టూత్‌పేస్ట్ తిని బతికిన యువకుడు.. ఆ 10 రోజులు ఏం జరిగిందంటే!
Chinese Hacker
Balaraju Goud
|

Updated on: Feb 27, 2025 | 6:11 PM

Share

హైకింగ్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు..! అన్ని వయసుల వారు ఆనందించే శారీరకంగా, మానసికంగా ఉల్లాసాన్ని ఇచ్చే ఒక రకమైన అభిరుచి. అయితే, దీనికి సంబంధించి ఓ సంఘటన అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఎవరూ ఊహించనిది! అలాంటి సంఘటనే ఇప్పుడు హాట్‌టాపిక్ మారింది. ఒక వ్యక్తి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా పర్వతాలలో చిక్కుకుపోయాడు. అయితే, ఇక్కడ అతని అదృష్టం అతనికి అనుకూలంగా మారింది. దీంతో అతను తన జ్ఞానంతో ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు..!

ఈ షాకింగ్ కేసు చైనాలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సన్ అనే 18 ఏళ్ల బాలుడు చైనాలోని చల్లని ఈశాన్య పర్వత ప్రాంతంలో హైకింగ్ కోసం వెళ్ళాడు. అకస్మాత్తుగా ఏదో జరిగి అతను అదృశ్యమయ్యాడు. ఆ తరువాత, తన ప్రాణాలను కాపాడుకోవడానికి, అతను లియాంగ్ నది నుండి నీరు, తన దగ్గర ఉన్న టూత్‌పేస్ట్ సహాయంతో తన ప్రాణాలను కాపాడుకున్నాడు..!

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఫిబ్రవరి 8న, సన్ అనే యువకుడు ఒంటరిగా హైకింగ్ వెళ్తాడు. అతను షాంగ్జీ ప్రావిన్స్‌లోని తూర్పు-పడమర పర్వత శ్రేణి అయిన క్విన్లింగ్‌ నుంచి ప్రారంభించాడు. ఈ పర్వతం సగటు ఎత్తు రెండున్నర వేల మీటర్లు ఉంటుంది. దీన్ని ఒంటరిగా ఎక్కాలనుకున్నాడు సన్. ఇది ప్రపంచంలోనే వన్యప్రాణులు, పొడవైన చెట్లకు ప్రసిద్ధి చెందింది. అయితే ఏమి జరుగుతుందంటే, సన్ ఇక్కడికి ప్రయాణం చేసినప్పుడు, అతని ఎలక్ట్రానిక్ పరికరం బ్యాటరీ అయిపోతుంది. దాని కారణంగా అతను తన కుటుంబాన్ని సంప్రదించలేకపోయాడు. అతని కుటుంబం అతను తప్పిపోయాడని భావించింది.

అయితే, ఇలాంటిదేమీ జరగలేదని, సన్ తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హైకింగ్ చేస్తున్నప్పుడు, ఒక వాగు ఒడ్డు వైపు నడుస్తున్నప్పుడు చాలాసార్లు పడిపోయానని తెలిపాడు. దీని ఫలితంగా తన కుడి చేతి ఎముక విరిగిందని చెప్పాడు. ఈ పరిస్థితిలో తనను తాను రక్షించుకోవడానికి, అతను ఒక పెద్ద రాయి వెనుక ఆగి, ఎండిన గడ్డి, ఆకుల సహాయంతో తన కోసం ఒక మంచం సిద్ధం చేసుకున్నాడు. తినడానికి తిండి లేకపోవడంతో తనతో ఉన్న టూత్ పేస్ట్‌ను తింటూ, వాగులోని నీళ్లు తాగుతూ ప్రాణాలను దక్కించుకున్నట్లు సన్ తెలిపాడు.

తన కుటుంబానికి ఈ విషయం గురించి తెలియదు. దాని కారణంగా వారు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత సన్ కుటుంబం స్థానిక సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాన్ని సంప్రదించి, కొడుకును రక్షించమని విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 17న రెస్క్యూ బృందం సన్‌ను కనుగొంది. అతన్ని విజయవంతంగా రక్షించారు. ఆ తర్వాత కుటుంబాన్ని మళ్ళీ కలవగలిగాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us