AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children’s Day: చిల్డ్రన్స్ డే.. మీ పిల్లలకు ఏ బహుమతి ఇవ్వబోతున్నారు..? ఇలా చేయండి

బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్‌ 14న జరుపుకొంటారు. చాచా నెహ్రూ అని పిలుబడే భారత మొదటి ప్రధాన మంత్రి పండిట్‌ జవహాల్‌లాల్‌ నెహ్రూ..

Children's Day: చిల్డ్రన్స్ డే.. మీ పిల్లలకు ఏ బహుమతి ఇవ్వబోతున్నారు..? ఇలా చేయండి
Children's Day 2022
Subhash Goud
|

Updated on: Nov 14, 2022 | 9:24 AM

Share

బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్‌ 14న జరుపుకొంటారు. చాచా నెహ్రూ అని పిలుబడే భారత మొదటి ప్రధాన మంత్రి పండిట్‌ జవహాల్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని చిల్ర్టన్స్‌ డే జరుపుకొంటారు. అయితే చిల్డ్రన్స్‌ డే రోజున పిల్లలకి బహుమతిగా ఏమివ్వబోతున్నారు? ఖరీదైన ఎలక్ట్రానిక్‌ ఆట వస్తువులూ, థీమ్‌ పార్కు, మాల్స్‌, హాల్స్‌లో పర్యటనలు..? పోనీ మొబైల్‌ ఫోన్‌ ఇస్తారా? భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి.. ఆర్థిక బాండ్లూ, బీమా పథకాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా? మంచిదే! కానీ వీటన్నింటికంటే నేటి పిల్లలకి వాళ్ల బాల్యాన్నే బహుమతిగా ఇవ్వాల్సిన అవసరముందంటున్నారు నిపుణులు. వాళ్లని వర్తమానంలో పిల్లలుగా చూడటం మరిచిపోతున్నాం. భవిష్యత్తునిస్తున్నామనే భ్రమలో.. వాళ్ల బాల్యాన్ని తీసేసుకుంటున్నాం! మరి దాన్నెలా మనం తిరిగివ్వాలి? ఉన్నదాన్ని ఎలా కాపాడాలి? తరగని ఆనందం, నియంత్రణలేని ఉద్వేగం .. ఇవే బాల్యం లక్షణాలు. చిన్నారులపై ఏ ఒత్తిడితేకుండా ఈ మూడింటిని సరైన దారి మళ్లించగలిగితే చాలు. మంచి బాల్యాన్ని బహుమతిగా అందించినట్టే!

  1. పిల్లల పట్ల అసలైన ధ్యానం..: నేటి తల్లిదండ్రులు చిన్నపిల్లల్నీ ధ్యానం, యోగా, మైండ్‌ఫుల్‌నెస్‌ తరగతులకి పంపిస్తున్నారు. పిల్లలకి ఇవేవీ అక్కర్లేదు! వాళ్లకి ఇవన్నీ ఆటలే అందిస్తాయి. ఆట మైదానం ఉండే బడులనే ఎంచుకోండి. రోజులో కనీసం గంటైనా ఆడుకోనివ్వండి. సెలవులప్పుడు రోజంతా వాళ్లు ఆటలో మునిగితేలినా ఫర్వాలేదు.
  2. పిల్లలను దగ్గరకు చేర్చుకోండి: పిల్లలు ఎంతపెద్దవారైనా సరే.. లాలనగా దగ్గరకు తీసుకోవడం, వెన్నుతట్టడం, కౌగిలించడం, అల్లరిగా ఎత్తుకుని తిప్పడం మరవొద్దు. మనదేశంలోని తల్లిదండ్రులం ఒక వయసు తర్వాత పిల్లల్నిలా తాకకుండా దూరం పెట్టడం వల్లే వాళ్లలో ఒంటరితనం పెరుగుతోందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
  3. పిల్లల్ని ప్రకృతిలో మమేకం చేయండి: పిల్లలతో ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారైనా సరే కలిసి నడవండి. ఆరేళ్లలోపు పిల్లలైతే సూర్యోదయాన్నీ, సుర్యాస్తమయాన్నీ చూపిస్తూ అడుగులేయడం మంచిది. మూడునెలలకోసారైనా పచ్చటి పంటపొలాలూ, అభయారణ్యాలకి తీసుకెళ్లండి. వీలున్నప్పుడల్లా ఆరుబయట పడుకుని చుక్కల్నీ, చంద్రుణ్నీ చూపిస్తూ కథలు చెప్పండి. ఏ భయమూ లేకుండా వర్షంలో తడవడం, నిలిచి ఉన్న నీటిలో నడవడం, మట్టిలో ఆడుకోవడం, మొక్కలు నాటించడం ఇవన్నీ చేయించండి. చిన్నారుల్లో మనకున్న అన్ని ఉద్వేగాలూ కనిపిస్తాయి. వాటిని పట్టించుకోకుంటే గుండెలోనే గూడుకట్టుకుని భవిష్యత్తులో మానసిక వ్యాకులతగా పరిణమిస్తాయి.
  4. పిల్లల పట్ల చెడుగా మాట్లాడకండి: పిల్లల్లోని కోపం, ఆవేశం, అక్కసూ, అసూయ, భయం వంటివాటిని చూపి వాళ్లని చెడుగా మాట్లాడకండి. వారిలో అపరాధభావం కలిగించకండి. కోపాన్ని పట్టుదలగా, ఆవేశాన్ని శ్రమగా, అసూయని పోరాటపటిమగా మార్చుకోవచ్చని వివరించండి. ఎంత తల్లిదండ్రులమైనా ఒక్కోసారి అప్పుడప్పుడూ విసుగూ, కోపం చూపకుండా ఉండలేం. అందుకే వాళ్లకి పెంపుడు జంతువుల్ని దగ్గరచేయండి. అవి చూపించే ప్రేమ.. వాళ్లని ఎప్పుడూ ఆనందంలో ఉంచుతుంది. భిక్షగాళ్లకి చిల్లర వేయడం, వృద్ధాశ్రమాలకి తీసుకెళ్లడం వంటివీ వాళ్లకు నేర్పించండి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఆ భయాన్ని పోగొట్టండి: నాలుగేళ్ల పిల్లలకు కూడా అమ్మానాన్నా విడిపోతారనే భయం ఉంటుంది. ఇద్దరి పోట్లాటలూ, ఏడుపులూ వాళ్లలో నిద్రలేమీ, ఏకాగ్రతాలోపంగా బయటపడుతుంటాయి! అందుకే మీరు గొడవపడ్డా అదేం పెద్ద విషయం కాదని పిల్లలకి చెప్పాలి. పిల్లలు.. కుతూహలానికీ ప్రతిరూపాలు. ఆ ఉత్సుకతని మనం భద్రంగా కాపాడగలిగితే ఎన్ని నైపుణ్యాలైనా సాధించగలుగుతారు.
  7. శ్రద్దగా వినండి: వాళ్లు అడిగే ప్రతి ప్రశ్నకీ విసుక్కోకుండా ఏదో ఒక సమాధానం ఇవ్వండి. అది సరిగానే ఉండాల్సిన అవసరం లేదు. తల్లి తమని శ్రద్ధగా వింటోందనే భావనే వాళ్లకి ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తుంది.
  8. ఇల్లే ఓ రంగస్థలం..వారానికోసారైనా వాళ్లతో చిన్నపాటి నాటకాలు వేయించండి. ఏదో ఒక కొత్త పాత్ర ధరించేలా చూడండి. మొదట్లో మీరు దర్శకత్వం వహించినా.. ఆ తర్వాత వాళ్లే అందిపుచ్చుకుంటారు. ఇది పిల్లలకి కేవలం ఆనందమే కాదు.. విభిన్న వ్యక్తులూ, మనస్తత్వాల్ని అర్థం చేసుకోవడం ఇట్టే నేర్పుతుంది.
  9. టీవీలు, మొబైల్‌లు.. నేటితరం పిల్లలు వీటికి ఇట్టే దగ్గరైపోతున్నారు! కానీ ఏ రకమైన ఎదుగుదలకీ ఇవి రెండూ మంచిదికాదు. కదిలే దృశ్యాలు పిల్లల్ని ఆలోచించనివ్వవు. వారి వూహలకి తావివ్వవు, తర్కానికీ చోటివ్వవు. ఆ ఆలోచనా, వూహా, తర్కమే.. మేధస్సుకి మూలం. అందుకే పెద్దగా అవసరమైతే తప్ప వాళ్లని మొబైళ్లకు, టీవీలకు దూరంగా ఉంచడమే మంచిది.

మరిన్ని ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి