Child Care: పిల్లలకు పాలతో కలిపి ఇవి అస్సలు పెట్టకండి.. వారి ఆరోగ్యం దెబ్బతింటుంది..

పిల్లల ఎదుగులదలకు, ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యమైనవి. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది వారి శారీరక వికాసానికి మాత్రమే కాకుండా, మానసిక అభివృద్ధి కూడా దోమదపడుతాయి. ప్రతి తల్లి తన బిడ్డకు పాఠశాలకు వెళ్లే ముందు ఒక గ్లాసు పాలు ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు కూడా తమ పిల్లలకు పాలు తాగిస్తుంటారు.

Child Care: పిల్లలకు పాలతో కలిపి ఇవి అస్సలు పెట్టకండి.. వారి ఆరోగ్యం దెబ్బతింటుంది..
Child Milk Drinking
Follow us

|

Updated on: Mar 28, 2023 | 8:40 AM

పిల్లల ఎదుగులదలకు, ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యమైనవి. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది వారి శారీరక వికాసానికి మాత్రమే కాకుండా, మానసిక అభివృద్ధి కూడా దోమదపడుతాయి. ప్రతి తల్లి తన బిడ్డకు పాఠశాలకు వెళ్లే ముందు ఒక గ్లాసు పాలు ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు కూడా తమ పిల్లలకు పాలు తాగిస్తుంటారు. పిల్లలకు పాలు చాలా ముఖ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, పాలు తాగించే విధానంలో లోపాలు ఉంటే.. అది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని పదార్థాలను పాలతో కలిపి అస్సలు ఇవ్వొద్దు. మరి ఆ పదార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. సిట్రస్ పండ్లతో పాలు..

నారింజ, నిమ్మకాయలు మొదలైన సిట్రస్ పండ్లతో కలిపి పాలు ఎప్పుడూ ఇవ్వొద్దు. సిట్రస్ పండ్లలో యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా పాలలోని ప్రోటీన్ స్తంభింపజేస్తుంది. జీర్ణం కావడం కష్టమవుతుంది. ఈ కలయిక గ్యాస్, ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

2. పాలతో ఉప్పు కలిపిన స్నాక్స్..

పిల్లలకు పాలతో పాటు చిప్స్ మొదలైన ఉప్పు కలిపిన చిరుతిళ్లను తల్లిదండ్రులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఉప్పగా ఉండే చిరుతిళ్లు డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి. దీని వల్ల పాలు జీర్ణం కావడం కష్టమవుతుంది. ఈ కలయిక జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది.

3. పాలతో పుచ్చకాయ..

పాలలో ప్రోటీన్, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ, సీతాఫలంతో పాలు కలిపి ఇవ్వడం వలన ఇబ్బందు వస్తాయి. పుచ్చకాయలో ఉండే యాసిడ్, పాలలో ఉండే ప్రోటీన్‌ను బంధిస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియ, ఇతర శారీరక సమస్యలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

4. పాలు, ద్రాక్ష..

ద్రాక్ష తిన్న తర్వాత పాలు తినిపించొద్దు. ఈ రెండింటి కలయిక వల్ల జీర్ణకోశ సమస్యలు, కడుపునొప్పి, విరేచనాలు వస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..