Chhatrapati Shivaji Jayanthi 2021: భరత జాతి వీరయోధుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు.. ఆయన గురించి 10 వాస్తవాలు..

భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే చత్రపతి శివాజీ జయంతి నేడు. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ గొప్ప యోధుడు.

Chhatrapati Shivaji Jayanthi 2021: భరత జాతి వీరయోధుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు.. ఆయన గురించి 10 వాస్తవాలు..
Follow us

|

Updated on: Feb 19, 2021 | 4:51 PM

భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే చత్రపతి శివాజీ జయంతి నేడు. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ గొప్ప యోధుడు. అలాంటి యోధుడి జన్మధినాన్ని భారత్‏లో వేడుకగా జరుపుకుంటుంటారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో పండగలాగా జరుపుకుంటారు. మాస్టర్ స్ట్రాటజిస్ట్‏గా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ మొఘలులపై అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని రూపొందిచాడు. 1674లో శివాజీకి చక్రవర్తీగా పట్టాభిషకం జరిగింది. అలాంటి గొప్ప వీరయోధుడి 391వ జయంతి నేడు. ఛత్రపతి శివాజీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు..

1. ఛత్రపతి శివాజీ జననం..

ఛత్రపతి శివాజీ క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ బొస్లే కులానికి చందినవారు.

2. శివాజీ పేరు వెనకగల రహస్యం..

శివాజీ తల్లి జీజియ బాయ్ యాదవ్ క్షత్రియ వంశమునకు చెందిన ఆడ పడుచు. శివాజీ పుట్టడానికి ముందు పుట్టిన వారందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతికి పూజించగా శివాజీ పెట్టి క్షేమంగా ఆన్నాడు. దీంతో ఆయననకు ఆ పేరు పెట్టారు.

3. శివాజీ వీరత్వం..

శివాజీ 17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిని తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్లలో కొండన, రాజ్ ఘడ్ కోటలను సొంతం చేసుకొని.. పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

4. ఛత్రపతి శివాజీకి మరోపేరు..

ఛత్రపతి శివాజీని మౌంటైన్ ఎలుక అని పిలుస్తారు. అలాగే గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ఛత్రపతి శివాజీని ప్రసిద్ధిగా కొలుస్తారు.

5. మొఘలులతో యుద్ధాలు..

1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్‌కు లక్షకు పైగా సుశిక్షుతులయిన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమయిన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్‌లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరుచుకొన్నాడు.

6. పరిపాలనా విధానం..

ఛత్రపతి శివాజీ యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా.. పరిపాలనా విధానంలో కూడా అగ్రగణ్యుడు. తన రాజ్యంలో మంత్రిమండలి, విదేశాంగ విధానంతోపాటు, గూడఛారి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. ప్రజల ప్రభువుగా పరిపాలన చేస్తూ.. వ్యక్తిగత విలాసాలకు ఏలాంటి తావివ్వలేదు.

7. ఛత్రపతి శివాజీ కోటలు..

ఛత్రపతి శివాజీ మరణించేనాటికి 300 కోటలు ఆయన అధీనంలో ఉండేవి. కొండ ప్రాంతలలో సాంకేతిక విలువలతో కోటలను నిర్మించడం శివాజీకి అలవాటు. అలా నాసిక్ నుంచి మద్రాసు వరకు ఉన్న జింగీ వరుక 1200 కిలోమీటర్ల మధ్య దాదాపు 300 కోటలను నిర్మించాడు.

8. మతసామరస్యం..

శివాజీకి మత బోధనలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఎక్కువగా హిందూ సాధువులతో సమయానికి వెచ్చించేవాడు. సహజంగా శివాజీ భవాని దేవి భక్తుడు. కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే కాకుండా.. ఎన్నో మసీదులు కూడా కట్టించారు. అలాగే ఆయన సైన్యంలో మూడొంతలు ముస్లింలు ఉండేవారు. హైదర్ ఆలీ, ఇబ్రహీం ఖాన్, సిద్ధి ఇబ్రహీం వంటివారు సైన్యంలో కీలక పదవులలో ఉండేవారు.

9. సూరత్ యుద్ధం..

1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. దీంతో శివాజీ ఆ నగరంపై దాడి చేసి ధనంతోపాటు.. ఆయుధాలను దోచుకున్నాడు. అలాగే వేలాదిమందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. తర్వాత మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకున్నాడు.

10. యుద్ధంలో శివాజీ పలికే మాట..

బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుంచి మెరికల్లాంటి పదివేల మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించేందుకు పథకం వేశారు. అయితే శివాజీ 5000 మరాఠా యోధులతో కలిసి కొల్హాపూర్ వద్ద వారిని ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో శివాజీ హర హర మహాదేవ అని పలుకుతూ.. యుద్ధంలో విజృంభించి.. విజయం సాధించాడు. దీంతో కేవలం సుల్తానులే కాకుండా.. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు కూడా శివాజీ అంటే వణుకు పుట్టింది.

Also Read:

Chattrapati Shivaji Jayanti: రాజులు గుర్రం మీద ఉన్న విగ్రహం .. అశ్వం కాళ్ళు వారి మరణానికి చిహ్నమేనా..?

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!