Telangana: మహిళా కూలీలతో కలిసి పాటలు పాడుతూ వరిపొలంలో నాట్లు వేస్తున్న ఈ ఎమ్మెల్యేను గుర్తుపట్టారా..?
బురదలో నాట్లు వేస్తున్న ఈవిడ ఎవరో గుర్తుపట్టారా?.. ములుగు ఎమ్మెల్యే సీతక్క. నిత్యం ప్రజాక్షేత్రంలో వుండే సీతక్క ఇలా ఓ సాధారణ రైతు కూలీగా మారారు..
MLA Seethakka Farming : బురదలో నాట్లు వేస్తున్న ఈవిడ ఎవరో గుర్తుపట్టారా?.. ములుగు ఎమ్మెల్యే సీతక్క. నిత్యం ప్రజాక్షేత్రంలో వుండే సీతక్క ఇలా ఓ సాధారణ రైతు కూలీగా మారారు.. వరి నాట్లు వేస్తూ మహిళా కూలీలతో శృతి కలిపి పాటలు పాడారు.
సాధారణంగా రైతులు వరినాట్లు వేసే సమయంలో ఇలా పాటలు ఆలపిస్తూ అంతా ఒకే స్వరమై అలసట తెలియకుండా నాట్లు వేస్తుంటారు.. గురువారం ఉదయం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రెడ్డిగూడెంలో ఓ కార్యక్రమానికి హాజరైన సీతక్క తిరుగు ప్రయాణంలో ఇలా వరిపొలంలోకి దిగి వారితో పాట జతకట్టారు.
రెడ్డిగూడెం శివారులో పంటపొలాల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే సీతక్క ఓ సాధారణ రైతు కూలీగా మారారు. మహిళా కూలీలతో కలివిడిగా కలిసిపోయారు. కూలీలు, రైతులతో కలిసి బురదలోకి దిగిన సీతక్క సరదాగా పాటలు పాడుతూ నాట్లు వేశారు. తనతో పాటు, తన వెంట వచ్చిన కార్యకర్తల చేత కూడా నాట్లు వేయించి సందడి చేశారు.
Also Read:
ఐడియా అదుర్స్.. మొక్కజొన్న పంటను కాపాడుకోడానికి రైతన్నల క్రేజీ ప్లాన్స్.. ఏం చేస్తున్నారంటే..
” ఈ ప్రపంచంలో నేను ఒంటరి వ్యక్తిలా భావించాను”.. సంచలన విషయాన్ని బయపెట్టిన కోహ్లీ