AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chattrapati Shivaji Jayanti: రాజులు గుర్రం మీద ఉన్న విగ్రహం .. అశ్వం కాళ్ళు వారి మరణానికి చిహ్నమేనా..?

భరతమాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ..   విశ్వాస్ ,కృష్ణుడు ఇలా ఏడు మేలిమిజాతి జాతి గుర్రాలను వాడేవారని.. అవి  పంచ కళ్యాణి జాతికి చెందిన గుర్రాలని చాలా మందికి తెలుసు. చరిత్రలో పంచకల్యాణి గుర్రం వాడిన మరికొందరి

Chattrapati Shivaji Jayanti: రాజులు గుర్రం మీద ఉన్న విగ్రహం .. అశ్వం కాళ్ళు వారి మరణానికి చిహ్నమేనా..?
Surya Kala
|

Updated on: Feb 19, 2021 | 12:54 PM

Share

Chattrapati Shivaji Jayanti: నేడు ఛత్రపతి శివాజీ జయంతి.. ఈరోజు ఆయనతో పాటు ఇంతటి ఖ్యాతికి కారణమైన తల్లిదండ్రులు, గురువును ఎలా గుర్తు చేసుకుంటారో.. అనేక యుద్ధాల్లో శివాజీ తో పాటు పాల్గొన్న .. ఖడ్గాన్ని, గుర్రాన్ని అందరూ ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. నిజానికి పూర్వకాలంలో ముఖ్యంగా రాజుల కాలంలో అశ్వాలకు అత్యంత ప్రాధాన్యత ఉండేది. అందుకనే రాజులు తమ పదాతి దళాల్లో అశ్వదళాన్ని బలోపేతం చేసుకునేవారు. ఇక చేసిన యుద్ధాల్లో ఓటమి ఎరుగని ధీరుడు భరతమాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ..   విశ్వాస్ ,కృష్ణుడు ఇలా ఏడు మేలిమిజాతి జాతి గుర్రాలను వాడేవారని.. అవి  పంచ కళ్యాణి జాతికి చెందిన గుర్రాలని చాలా మందికి తెలుసు. చరిత్రలో పంచకల్యాణి గుర్రం వాడిన మరికొందరి రాజుల గురించి తెలుసుకుందాం..! .

బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన ఝాన్సీ లక్ష్మీబాయి .. వాడిన గుర్రాలు.. పవన్, బాదల్,సారంగి. వీటిపైనే ఆమె స్వారీ చేసింది. ఇక విజయనగర ప్రభువులు, బహుమనీ సుల్తానులు అరబ్బు గుర్రాలపైనే ఆధారపడి తమ అశ్వదళాలను బలోపేతం చేసుకొన్నారు. విజయనగర విరుపాక్ష రాయలు అనే రాజు గోవాలో అరబ్బులు గుర్రాలను తనకు అమ్మలేదని, బహుమని వారికి అమ్ముతున్నారని కోపించి అరబ్ వ్యాపారులందరిని ఊచకోత కోయించాడు.

రాణాప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్ .. మహారాజు రాణా ప్రాణాలకు కాపాడిన గుర్రం చేతక్.. అందుకనే భారతీయ వాహనాల్లో ఒకటైన చేతక్ స్కూటర్.. ఈ పేరు చేతక్ అనే విశ్వాసపాత్రమైన గుర్రం పేరునే ఆ కంపెనీ తమ స్కూటర్ కు పేరుగా పెట్టుకుంది. అప్పట్లో ఎంతో ఫేమస్ కూడా అయింది.

మొఘల్ సామ్రాజ్య అధినేత అక్బరు గుర్రం పేరు రాహ్ బర్ అంటే నమ్మకస్తుడని అర్థం. ప్రపంచ జగజ్జేతగా నిలవాలని కోరుకున్న అలెగ్జాండర్ గుర్రం పేరు బుచేపోలస్. తెలుగు వారి ఖ్యాతని దశదిశలా వ్యాపింపజేసినా శ్రీకృష్ణ దేవరాయలు కూడా అశ్వాలను అత్యంత ఇష్టంగా చూసేవారని చరిత్రకారుల కధనం.

ఇక రాజుల విగ్రహాలను ప్రతిష్టిస్తూ అదీ గుర్రం మీద ఉన్నట్లు విగ్రహం ఏర్పాటు చేస్తే.. కొన్ని నియమనిబంధనలు తెలుసుకోవాలి.. ఎందుకంటే రెండు కాళ్ళును గుర్రం పైకి ఎత్తి ఉందంటే గుర్రంపైనున్న వ్యక్తి గాయాలతో యుద్ధభూమిలో చనిపోయినట్టు గుర్తు. ఇక ఒక కాలు పైకి ఎత్తినట్లుగా గుర్రం విగ్రహం ఉంటే ఆవ్యక్తి గాయాలతో యుద్ధం బయట చనిపోయినట్టు. నాలుగు కాళ్ళు భూమిపై మోపి ఉంటే సహజ మరణం చెందినట్లు ఆ రాజు యొక్క మరణాన్ని తెలియజేస్తుంది. ఈ నిబంధనలను పట్టించుకోకుండా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారనే వాదనలు కూడా చోటు చేసుకున్నాయి. అశ్వాలను గురించి తెలియచేసే శాస్త్రం అశ్వశాస్త్రం.. పాండవులలో చివరివారైన మాద్రి కుమారులు .. నకుల, సహదేవులు తురగ శాస్త్ర ప్రవీణులని ప్రసిద్ధి

Also Read:

 ఒకేరోజు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం.. భక్త సంద్రంగా మారిన మాడవీధులు

ఛత్రపతి శివాజీ అధిరోహించిన గుర్రం పేరు.. విశిష్టత గురించి తెలుసుకుందాం..!