Serial Dater Sundar Ramu: ఇతనొక సీరియల్ డేటర్.. ఇప్పటి వరకు 335 మంది మహిళలతో డేటింగ్..
Serial Dater Sundar Ramu: చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఐదున్నర సంవత్సరాలుగా వింత లక్ష్యం పెట్టుకొని తిరుగుతున్నాడు.
Serial Dater Sundar Ramu: చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఐదున్నర సంవత్సరాలుగా వింత లక్ష్యం పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆసక్తికరమైన పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. అతడి లక్ష్యం ఏంటంటే 365 మంది మహిళలతో డేటింగ్ చేయడం. ఇదేం లక్ష్యం అనుకుంటున్నారా.. అవును ఇది నిజం ఇప్పటివరకు 335 మంది మహిళలతో డేటింగ్ చేశాడు. మరో 30 మంది మహిళలతో డేటింగ్ చేస్తే అతడి లక్ష్యం నెరవేరుతుంది. అతడెవరో తెలుసుకోవాలని ఉందా.. ఆయనే సీరియల్ డేటర్ సుందర్ రాము. వృత్తి యాక్టర్, ఫోటోగ్రాఫర్. అయితే ఆయన ఇలా ఎందుకు వార్తల్లో నిలుస్తున్నాడో అతగాడి మాటల్లోనే తెలుసుకుందాం.
“నేనేదో ప్రేమను పొందడం కోసం మహిళలతో డేటింగ్ చేయడం లేదు. లేదా మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం కోసం డేటింగ్ చేయడం లేదు. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే.. భారత్‌లో మహిళల హక్కుల గురించి అవేర్‌నెస్ తేవడమే నా గోల్. అందుకే ఈ డేటింగ్‌ను ఎంచుకున్నా. నేను జనవరి 1, 2015లో 365 డేట్స్ అనే కాన్సెప్ట్‌ను స్టార్ట్ చేశా. ఈ కాన్సెప్ట్‌ను నేను స్టార్ట్ చేయడానికి కారణం.. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన. ఆ ఘటన గురించి తెలిశాక.. నేను కొన్ని నెలల పాటు నిద్రపోలేదు. నా మనసంతా ఏదో బాధేసింది. మహిళలపై అంత చిన్నచూపు ఎందుకు.. అనే ప్రశ్న నాలో వచ్చింది. అందుకే.. ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశా.
నా డేట్‌లో భాగంగా మహిళలతో కలిసి లంచ్ చేస్తా. కాఫీ తాగుతా. వాళ్లతో మహిళల హక్కుల గురించి చెబుతా. వాళ్లలో అవేర్‌నెస్ తీసుకొస్తా. ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. మతాల ముసుగును తొలగించుకొని.. స్వచ్ఛమైన ప్రేమ ఎలా పుడుతుంది, టెక్నాలజీ వల్ల మానవాళికి ముఖ్యంగా కుటుంబ విలువలు ఎలా పతనం అవుతున్నాయి లాంటి టాపిక్స్ గురించి నేను మహిళలతో చర్చిస్తాను” అని వివరించాడు. రాము గత ఐదున్నర సంవత్సరాలలో వియత్నాం, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, థాయ్‌లాండ్, శ్రీలంక వంటి దేశాలకు చెందిన మహిళలతో డేటింగ్‌కు వెళ్లాడు. ఆయన డేటింగ్ చేసిన వాళ్లలో 88 ఏళ్ల ఐరిష్ సన్యాసినితో పాటు 90 ఏళ్ల బెంగాళీ మహిళ కూడా ఉంది. వయసుతో సంబంధం లేకుండా డేటింగ్ చేయడం అన్నమాట.