AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీ ఇంట్లో లక్షి దేవి నిలిచి ఉండాలంటే ఈ తప్పులు అస్సులు చేయకండి.. అవేంటంటే..

ఆచార్య చాణక్యుడికి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాల్లో విశేష పరిజ్ఞానం ఉంది. అయితే ఆయన చెప్పిన అంశాలు ఈ కాలంలోనివారికి కూడా..

Chanakya Niti: మీ ఇంట్లో లక్షి దేవి నిలిచి ఉండాలంటే ఈ తప్పులు అస్సులు చేయకండి.. అవేంటంటే..
Chanakya Neeti
Sanjay Kasula
|

Updated on: Mar 25, 2022 | 9:30 PM

Share

కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, వాత్సయనుడు అనే పేర్లతో చాణక్యుడిని పిలుస్తుంటారు. తక్షశిలా విశ్వవిద్యాలయంలో  ఆచార్యగా పని చేశాడు. ఆచార్య చాణక్యుడికి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాల్లో విశేష పరిజ్ఞానం ఉంది. ఆచార్య చాణక్యునికి (Chanakya)రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై లోతైన అవగాహన ఉంది. అందుకే ఆచార్య చాణక్యుడు చరిత్రలో అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకనిగా గుర్తింపుపొందారు. ఏ నిర్ణయమైనా పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. ఆచార్య ఆలోచనలు చాణక్య నీతిలో కనిపిస్తాయి. ఆచార్య చాణక్య తెలిపిన ఈ విధానాలు ప్రస్తుత కాలంలో కూడా చాలా సందర్భోచితంగా ఉపయోగపడుతున్నాయి. చాణక్య నీతిలోని పలు విషయాలు జీవిత సత్యాన్ని తెలియజేస్తాయి. భారతదేశంలోని గ్రంథాలు, పద్యాలు,  ఇతర గ్రంథాలలో చాణక్యుడి పాండిత్యం, నేర్పు, దూరదృష్టి కనిపిస్తాయి. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో ఇంట్లో వచ్చే ఇబ్బందుల గురించి 5 సంకేతాలను ఇచ్చారు. నేను ఈ సంకేతాలను మొదటి నుంచి అర్థం చేసుకుంటే.. మీరు ఆర్ధిక ఇబ్బందులు రాకుండా చెక్ పెట్టవచ్చు.  

ప్రతి ఒక్కరు తమ జీవితం ఎలాంటి తప్పులను చూయకూడదో చాణక్యుడు ముందే చెప్పాడు. ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంధంలో చెప్పిన వాటి ప్రకారం. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఇంట్లో లక్ష్మి దేవి నిలిచి ఉంటుంది. 

పెద్దలను అవమానించడం: చాణక్యుడు చెప్పినట్లుగా.. ఏ ఇంట్లో అయితే పెద్దలకు గౌరవం లభించదో ఆ ఇంట్లో ధన లక్ష్మి నిలిచి ఉండదు.

పూజలో నిరాసక్తత: చాణక్య నీతి ప్రకారం.. ఇంట్లోని సభ్యులందరూ క్రమం తప్పకుండా పూజలు నిర్వహించాలి. పూజలు చేయడానికి కొంత సమయం పట్టినా.. తప్పకుండా భగవంతుని ముందు నమస్కరించాలని చాణక్యుడు చెప్పాడు. పూజలు చేయకపోవటం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందని.. భగవంతుని అనుగ్రహం ఉంటే ఆర్థిక సంక్షోభాన్ని తరిమి కొట్టవచ్చని తెలిపాడు.

తులసి మొక్కను ఎండబెట్టడం: ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే.. అది ఆర్థిక పరిస్థితి క్షీణించడాన్ని సూచిస్తుంది. డబ్బు రాకలో ఆటంకాలు ఏర్పడవచ్చు. తులసి మొక్క పచ్చగా ఉండే ఇంట్లో లక్ష్మి నివసిస్తుందని చాణక్యుడు తన నీతి గ్రంధంలో పేర్కొన్నాడు. కాబట్టి తులసి మొక్క పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

గాజు పగలడం : ఇంట్లో తరచుగా గాజు పగలడం అశుభాన్ని సూచిస్తుంది. ఈ విషయాలు ఆర్థిక సంక్షోభాన్ని ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఇంట్లో గాజు పగలగొట్టినప్పుడల్లా.. వెంటనే ఆ వస్తువును ఇంటి నుంచి బయట పడేయాలి. పగిలిన అద్దంలో ముఖం చూడొద్దని చాణక్యడు చెప్పాడు. 

ఇవి కూడా చదవండి: SBI: ఖాతాదారులకు గమనిక.. ఏపీలో రేపు, ఎల్లుండి ఎస్బీఐ బ్యాంకులు తెరిచి ఉంటాయి.. ఎక్కడంటే..

Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..

Kishan Reddy: పుత్రవాత్సల్యంతోనే రైతుల్ని బలిచేస్తున్నారు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..