Knowledge: పూర్తి మద్యపాన నిషేధమున్న రాష్ట్రాల్లోకి మద్యం బాటిల్స్ తీసుకెళ్లొచ్చా? అక్కడ మద్యం సేవించవచ్చా? ఆసక్తికర విషయాలు..

మనదేశంలో ప్రతి రాష్ట్రంలో మద్యపానానికి సంబంధించి వేర్వేరు నిబంధనలు అమలులో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లోనైతే మద్యపానంపై పూర్తి నిషేధం (alcohol ban states) ఉంది. ఈ రాష్ట్రాల్లోకి వెళ్లే..

Knowledge: పూర్తి మద్యపాన నిషేధమున్న రాష్ట్రాల్లోకి మద్యం బాటిల్స్ తీసుకెళ్లొచ్చా? అక్కడ మద్యం సేవించవచ్చా? ఆసక్తికర విషయాలు..
Dry State Rules
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 04, 2022 | 8:41 PM

What the rules of alcohol travel from other states: మనదేశంలో ప్రతి రాష్ట్రంలో మద్యపానానికి సంబంధించి వేర్వేరు నిబంధనలు అమలులో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లోనైతే మద్యపానంపై పూర్తి నిషేధం (alcohol ban states) ఉంది. ఈ రాష్ట్రాల్లోకి వెళ్లే సమయంలో మద్యం సీసాలు (alcohol bottles) మీ దగ్గర లభ్యమైతే కేసు నమోదవుతుంది కూడా. అంటే ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. అక్కడ అమలులో ఉన్న నియమాలు తప్పక పాటించవల్సి ఉంటుంది. మరైతే మద్యం ఎలా తీసుకెళ్లాలి? అక్కడ ఆల్కహాల్‌ ఎలా సేవించాలి?ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకెళ్లడానికి ఏయే నియమాలు పాటించాలి? వంటి మద్యం ప్రయాణ నియమాలు మీ కోసం…

మద్యంను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించవచ్చా? నిబంధనల ప్రకారం మద్యం బాటిల్‌ను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లవచ్చు. ఐతే ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో ఆ రాష్ట్ర నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఉదాహరణకు.. మీతో పాటు 4 మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్నారు. కానీ మీరు వెళ్లే రాష్ట్రంలోకి కేవలం 2 సీసాలు మాత్రమే అనుమతి ఉన్నట్లయితే.. 4 మద్యం సీసాలను తీసుకెళ్లడానికి ఆ రాష్ట్రం నుంచి తప్పనిసరిగా అనుమతి పొందవల్సి ఉంటుంది. ఒక వేళ మీరు పూర్తిగా మద్యపాన నిషేదమున్న రాష్ట్రానికి (డ్రై స్టేట్‌) వెళ్తున్నట్లయితే అక్కడి నియమాల ప్రకారం మద్యం సీసాలతో ఆ రాష్ట్రంలోకి వెళ్లకూడదు.

మరైతే డ్రై స్టేట్‌లో మద్యం సేవించడం ఎలా? డ్రై స్టేట్‌ రూల్స్‌కు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో వివిధ నియమాలు అమల్లో ఉన్నాయి. బీహార్‌లోనైతే మద్యం సేవించడానికి ఎవరికీ అనుమతి ఉండదు. ఐతే గుజరాత్‌లో మాత్రం ఇలా ఉండదు. బయటి వ్యక్తులు మద్యం తాగడానికి అనుమతి ఉంటుంది. ఐతే ముందుగా ఆ రాష్ట్రం అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ముందు ఆ రాష్ట్రంలో అమల్లోనున్న నియమాలు కూలంకషంగా తెలుసుకుని వెళ్లడం బెటర్‌!

Also Read:

AIIMS Jobs 2022: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు 2 లక్షలకు పైగా జీతంతో..