Viral Video: ఫోటో షూట్‌కెళ్లి... బురదలో పడ్డ వధూవరులు వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఫోటో షూట్‌కెళ్లి… బురదలో పడ్డ వధూవరులు వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

Anil kumar poka

|

Updated on: Mar 04, 2022 | 8:49 PM

ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునేవారు ప్రీ-వెడ్డింగ్ షూట్స్‌పై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. క్రియేటివిటీ.. కొంచెం రొమాంటిక్.. ఆపై విభిన్నమైన లొకేషన్స్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే అన్నీ సరిగ్గా ఉంటే.. అంతా బాగానే ఉంటుంది. కానీ క్రియేటివిటీ బెడిసికొడితే మాత్రం..


ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునేవారు ప్రీ-వెడ్డింగ్ షూట్స్‌పై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. క్రియేటివిటీ.. కొంచెం రొమాంటిక్.. ఆపై విభిన్నమైన లొకేషన్స్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే అన్నీ సరిగ్గా ఉంటే.. అంతా బాగానే ఉంటుంది. కానీ క్రియేటివిటీ బెడిసికొడితే మాత్రం.. సీన్ రివర్స్ అయిపోతుంది. సరిగ్గా ఇక్కడ అదే సీన్ రిపీట్ అయింది. ఓ జంట విభిన్న లొకేషన్‌లో తమ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ జరుపుకోవాలని అనుకున్నారు. అక్కడ కాస్త క్రియేటివిటీని ఉపయోగించారు. అంతే.. రచ్చ రంబోలా అయింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధూవరులు బురద నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు పోజులు ఇస్తున్నారు. మొదటి పోజులో వధువును.. వరుడు ఎత్తుకున్నాడు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్.. వరుడుని మరో ఫోజు ఇమ్మని చెప్పినట్టున్నాడు.. అందుకు ప్రయత్నించిన వరుడు.. వధువుతో కలిసి ముందున్న బురద నీటిలో పడ్డారు. ఆ వధువు తెల్లని వెడ్డింగ్‌ గౌను కాస్తా బురదమయమైపోయింది. ఇలా మొత్తం ప్రీ-వెడ్డింగ్ ఫోటో‌షూట్‌ను బురదతో నింపేసుకున్నారు వదూవరులు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ అయిన ఈ వీడియోను లక్షలమంది నెటిజన్లు వీక్షిస్తుండగా.. వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్

Published on: Mar 04, 2022 08:49 PM