AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Carrot: ఔషధాల కోసం ఉపయోగించే బ్లాక్ క్యారెట్.. రైతన్నకు లాభాల పంట.. ఎలా పండించాలంటే..

క్యారెట్లలో ఎన్నో రకాల క్యారెట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల రకాల క్యారెట్లు వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కుగా నారింజ రంగు క్యారెట్ వినియోగంలో ఉంది. అయితే నల్ల క్యారెట్ కూడా ఉంది. ఇందులో రెడ్ క్యారెట్ కంటే ఎక్కువ విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. బ్లాక్ క్యారెట్‌ను సలాడ్, పుడ్డింగ్, జ్యూస్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు.

Black Carrot: ఔషధాల కోసం ఉపయోగించే బ్లాక్ క్యారెట్.. రైతన్నకు లాభాల పంట.. ఎలా పండించాలంటే..
Black Carrot
Follow us
Surya Kala

|

Updated on: May 28, 2023 | 2:12 PM

దుంపల్లో ఒకటి క్యారెట్. ప్రతి ఒక్కరూ క్యారెట్ తినడానికి ఇష్టపడతారు. భారతదేశం అంతా సాగు చేస్తారు. క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విశేషమేమిటంటే క్యారెట్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది. జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉండేలా చేస్తుంది. మలబద్ధకం ఏర్పడకుండా చూస్తుంది. మార్కెట్‌లో క్యారెట్ కు ఎప్పుడూ డిమాండ్ ఉండడానికి ఇదే కారణం. రైతు సోదరులు క్యారెట్ సాగును ఎంచుకుంటే అన్నదాతకు కాసుల వర్షం కురిపిస్తుంది క్యారెట్ సాగు.

బ్లాక్ క్యారెట్‌ లో పోషకాలు

క్యారెట్లలో ఎన్నో రకాల క్యారెట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల రకాల క్యారెట్లు వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కుగా నారింజ రంగు క్యారెట్ వినియోగంలో ఉంది. అయితే నల్ల క్యారెట్ కూడా ఉంది. ఇందులో రెడ్ క్యారెట్ కంటే ఎక్కువ విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. బ్లాక్ క్యారెట్‌ను సలాడ్, పుడ్డింగ్, జ్యూస్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. అదే సమయంలో చాలా మంది నల్ల క్యారెట్‌ను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. విశేషమేమిటంటే సాధారణ క్యారెట్ లాగే నల్ల క్యారెట్ కూడా సాగు చేస్తారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ క్యారెట్ సాగు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నల్ల క్యారెట్ సాగుకు కావాల్సిన ఉష్ణోగ్రత.. 

నల్ల క్యారెట్ సాగుకు 15 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్తమంగా పరిగణించబడుతుంది. రైతు సోదరులు నల్ల క్యారెట్లను పండించాలనుకుంటే.. ముందుగా పొలాన్ని చాలాసార్లు బాగా దున్నాలి. పొలాన్ని ముందుగా సిద్ధం చేసిన తర్వాత వర్మీకంపోస్ట్‌ను వేసి, స్క్రీడ్‌ను అమలు చేయడం ద్వారా పొలాన్ని చదును చేయాలి. అనంతరం క్యారెట్ ను విత్తుకోవాలి. ఒక హెక్టారులో నల్ల క్యారెట్‌లను సాగు చేస్తే మీకు 5 నుండి 6 కిలోల విత్తనాలు అవసరం. విత్తిన 12 రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తుతాయి.

హెక్టారుకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి 

నల్ల క్యారెట్ ను విత్తడానికి 24 గంటల ముందు విత్తనాలను నీటిలో నానబెట్టినట్లయితే, విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. 80 నుండి 90 రోజులలో బ్లాక్ క్యారెట్ పంట కూడా సిద్ధంగా ఉంటుంది. హెక్టారుకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందవచ్చు. నల్ల క్యారెట్ ధర మార్కెట్‌లో కిలో 40 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. ఈ విధంగా రైతు సోదరులు ఒక హెక్టారులో వ్యవసాయం చేయడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..