Rules Deadline: బిగ్ అలర్ట్.. ఈ పనులు పెండింగ్ ఉంటే వెంటనే కంప్లీట్ చేయండి.. జూన్ 30 లాస్ట్ డేట్..

జూన్ నెల ప్రారంభం కావడానికి 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, ఆ నెల చివరి తేదీ అంటే జూన్ 30 నాటికి చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ సహా.. అనేక కీలకమైన పనులు ఉన్నాయి. వాటిని వెంటనే పూర్తి చేస్తే ఫ్రీగా ఉండొచ్చు..

Rules Deadline: బిగ్ అలర్ట్.. ఈ పనులు పెండింగ్ ఉంటే వెంటనే కంప్లీట్ చేయండి.. జూన్ 30 లాస్ట్ డేట్..
Bank Lockers
Follow us

|

Updated on: May 28, 2023 | 3:25 PM

జూన్ నెల ప్రారంభం కావడానికి 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, ఆ నెల చివరి తేదీ అంటే జూన్ 30 నాటికి చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ సహా.. అనేక కీలకమైన పనులు ఉన్నాయి. వాటిని వెంటనే పూర్తి చేస్తే ఫ్రీగా ఉండొచ్చు.. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జూన్ 30 దాటిందంటే.. పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. మరి.. ఆ కీలక పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆధార్-పాన్ లింక్..

మీరు ఇంకా మీ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయనట్లయితే.. జూన్ 30లోపు పాన్-ఆధార్ లింక్‌ను పూర్తి చేయాలి. జూన్ 30 వరకు మాత్రమే ఇందుకోసం అవకాశం ఉంది. ఒకవేళ ఈ తేదీలోపు మీరు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే.. జూన్ 30 తర్వాత పాన్ ఆధార్‌ను లింక్ చేయడానికి రూ. 1,000 రుసుము చెల్లించాల్సి వస్తుంది.

ఆధార్ కార్డ అప్‌డేట్..

దేశవ్యాప్తంగా 10 సంవత్సరాలుగా తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోని వ్యక్తులు జూన్ 14 వరకు మీ ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ పనిని మీరు స్వతహాగా ఆన్‌లైన్‌లోనూ చేసుకోవచ్చు. ఇందుకోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాకాకుండా, ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే, రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ లాకర్ ఒప్పందం..

బ్యాంకు లాకర్ ఉపయోగించే వ్యక్తులు.. నూతనంగా తీసుకువచ్చిన బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్‌ను అంగీకరించాల్సి ఉంటుంది. లాకర్ ఒప్పందాన్ని వెంటనే కంప్లీట్ చేయాలి. ఇందుకోసం జూన్ 30 వరకు అవకాశం ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. కస్టమర్లు జూన్ 30 లోపు బ్యాంక్ లాకర్ ఒప్పందాన్ని పూర్తి చేసుకోవాలి. తద్వారా ఎలాంటి సమస్యలు ఉండవని బ్యాంకర్లు చెబుతున్నారు. లేదంటే.. కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్..

పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ ‘ఇండ్ సూపర్ 400 డేస్’ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు వినియోగదారులకు జూన్ 30 వరకు అవకాశం ఉంది. గడుము పూర్తయిన తరువాత కస్టమర్లు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అలాగే, పెట్టుబడి పెట్టిన వారు ఈ పథకం మూసివేత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత వారి మొత్తం డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇవ్వబడుతుంది.

అధిక పెన్షన్ కోసం దరఖాస్తు..

అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి జూన్ 26వ తేదీలోపు అవకాశం ఉంది. ఈ గడువు లోగా అప్లై చేసుకుంటే.. అధిక పెన్షన్ స్కీమ్‌ ప్రయోజనాన్ని పొందుతారు. గడువు దాటితే.. అవకాశం కోల్పోతారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి