పెళ్లికి రెండు రోజుల ముందు పారిపోయిన అమ్మాయి.. కారణం తెలిసి అంతా షాక్!

రెండు రోజుల్లో పెళ్లి. ఇంతలో కనిపించకుండా పోయిన పెళ్లి కూతురు. తీరా చూస్తే, స్నేహితురాలి ఇంట్లో కనిపించింది. పోలీసుల విచారణలో యువతి చెప్పిన మాటలకు అంతా షాక్ అయ్యారు.

పెళ్లికి రెండు రోజుల ముందు పారిపోయిన అమ్మాయి.. కారణం తెలిసి అంతా షాక్!
Newlywed Bride
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 14, 2024 | 8:52 PM

బీహార్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది.  నవాడా ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి పెళ్లికి రెండు రోజుల ముందు ఇంటి నుంచి పారిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టగా, చివరికి బీహార్ షరీఫ్‌లోని ఆమె స్నేహితురాలి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. యువతిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, ఆమె చెప్పిన విషయానికి షాక్ అయ్యారు. తన అనుమతి లేకుండానే తన పెళ్లి జరుగుతోందని యువతి చెప్పింది.

తల్లిదండ్రులు చూసిన అబ్బాయి తనకు నచ్చలేదని యువతి పోలీసులకు తెలిపింది. ఆమె పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ముదురు రంగులో ఉన్నాడు. ఆమెకు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా అతనిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. దీంతో గత్యంతరం లేక ఇంటి నుంచి పారిపోయినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. చివరికి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు యువతిని కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఈ ఘటన నవాడా జిల్లాలోని రూపౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింఘానా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబరు 4న గ్రామానికి చెందిన యువతి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి విషయంలో ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్డులు కూడా పంపిణీ చేశారు. డిసెంబరు 2న హఠాత్తుగా ఇంట్లోంచి అమ్మాయి మాయమైంది. యువతి ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం వెతుకులాట ప్రారంభించారు.

ఇంతలో పోలీసులు బాలిక మొబైల్‌పై నిఘా పెట్టారు. సాంకేతిక ఆధారాలతో యువతి బీహార్ షరీఫ్‌లో ఉన్నట్లు తేలింది. అమ్మాయి స్నేహితురాలు ఇక్కడే ఉంటోంది. పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని పట్టుకున్నారు. ఈ సమయంలో బాలిక జరిగిన తతంగం అంతా పోలీసులకు వివరించింది. తాను ముదురు అబ్బాయిని పెళ్లి చేసుకోనని చెప్పింది. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయింది. పోలీసులు బాలికను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల అనంతరం యువతిని కుటుంబసభ్యులకు అప్పగించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..