Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiration: కూలీ కొడుకు నీట్ కొట్టాడు.. ఆ గ్రామంలో తొలి డాక్టర్ కాబోతున్నాడు

చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు చాలామంది గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుతాయి. ఎన్ని సమస్యలు ఎదురైతే మనుషులు అంత కఠినంగా తయారవుతారు.

Inspiration: కూలీ కొడుకు నీట్ కొట్టాడు.. ఆ గ్రామంలో తొలి డాక్టర్ కాబోతున్నాడు
Inspiration
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 26, 2021 | 3:49 PM

చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు చాలామంది గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుతాయి. ఎన్ని సమస్యలు ఎదురైతే మనుషులు అంత కఠినంగా తయారవుతారు. ఆటుపోట్లు ఎదుర్కోని ముందుకు సాగుతారు. తాజాగా ఓ నిరుపేద యువకుడు నీట్ ప్రవేశ పరీక్షలో 720కి 626 మార్కులు సాధించి.. సీటు సంపాదించాడు. ప్రజంట్ అతడు గ్రామంలో తొలి డాక్టర్ కాబోతున్నాడు. రాజస్థాన్ లోని బార్మెర్‌లో పేద కుటుంబంలో పుట్టిన దుధారామ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.

ఉండేది పూరి గుడిసెలో.. తల్లి దినసరి కూలీ.. తండ్రి భవన నిర్మాణం కూలీ. తన వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకోవడం చూసి దుధారామ్‌కి బాగా చదివి డాక్టర్ కావాలన్నది కల. రాత్రీ, పగలూ కష్టపడ్డాడు. ఫలితం కనిపించింది. NEETలో ఆల్ ఇండియాలో 9,375 ర్యాంక్ సాధించాడు. నాలుగో ప్రయత్నంతో ఇది సాధ్యమైంది. గ్రామంలో MBBS చేయనున్న తొలి వ్యక్తి అయ్యాడు.

దుధారామ్ ఉండే సందారీ తెహసిల్‌లో 250 ఇళ్లు ఉన్నా.. కరెంటు ఉండేది మాత్రం రోజుకి ఐదారు గంటలే. 10 కిలోమీటర్ల అవతల ఉన్న చెరువు నుంచి నీరు తెచ్చుకుంటారు. టెన్త్, ఇంటర్‌లో ఫస్ట్‌ క్లాస్ మార్కులు తెచ్చుకున్న దుధారమ్‌లో టాలెంట్ గుర్తించిన స్కూల్ టీచర్ రాజేంద్ర సింగ్… డాక్టర్ చదవాలని ఎంకరేజ్ చేశారు. దాంతో ఓ కోచింగ్ సెంటర్‌లో చేరి… NEETకి ప్రిపేర్ అయ్యాడు. ఆ కోచింగ్ సెంటర్ ఫీజులో 50 శాతం తగ్గించింది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో చదివి నాలుగో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించాడు. ఇప్పుడు డాక్టరు చదువకు సీటు సంపాదించడమే కాదు.. తన లాంటి విద్యార్థుల్లో చైతన్యం నింపుతాను అంటున్నాడు. మరెంతో మంది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో విజయం సాధించేలా సలహాలు, సూచనలూ ఇస్తానంటున్నాడు.

Also Read: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్