Vastu Tips: టెర్రస్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా.? ఆర్థికంగా నష్ట పోతారు..

వాస్తు శాస్త్రంలో ప్రతీ ఒక్క అంశం గురించి వివరించారు. ఇంటి నిర్మాణం మొదలు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల వరకు అన్నీ వాస్తు ప్రకారం ఉండాల్సిందే. వాస్తు శాస్త్రంలో తెలిపిన వివరాల ప్రకారం ఇంటి టెర్రస్‌పై ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల వస్తువులను ఉంచకూడదని నిపునులు చెబుతున్నారు. ఇంతకీ టెర్రస్‌పై ఉంచకూడని...

Vastu Tips: టెర్రస్‌పై ఈ వస్తువులు పెడుతున్నారా.? ఆర్థికంగా నష్ట పోతారు..
Vastu Tips
Follow us

|

Updated on: Mar 19, 2024 | 5:07 PM

వాస్తు శాస్త్రంలో ప్రతీ ఒక్క అంశం గురించి వివరించారు. ఇంటి నిర్మాణం మొదలు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల వరకు అన్నీ వాస్తు ప్రకారం ఉండాల్సిందే. వాస్తు శాస్త్రంలో తెలిపిన వివరాల ప్రకారం ఇంటి టెర్రస్‌పై ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల వస్తువులను ఉంచకూడదని నిపునులు చెబుతున్నారు. ఇంతకీ టెర్రస్‌పై ఉంచకూడని ఆ వస్తువులు ఏంటి.? ఇలా చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పు మీద చెత్త వేయకూడదు. టెర్రస్‌పై చెత్త ఉంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే ఇంట్లో ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో టెర్రస్‌ను కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

* ఇక కొందరు స్టోర్‌ రూమ్‌లో ఉంచాల్సిన పాత వస్తువులను, పేపర్లను టెర్రస్‌పై పెడుతుంటారు. ఇలా పనికి రాని వస్తువులను ఇంటి టెర్రస్‌పై పెడితే ఆర్థకంగా ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

* చీపుర్లు, తుప్పు పట్టిన ఇనుము లేదా వృధా చెక్క ముక్కలను ఇంటి టెర్రస్‌పై ఉంచకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది.

* ఇక టెర్రస్‌లపై పిచ్చి మొక్కలు సైతం పెరుగుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తొలగించకపోతే అనర్థం తప్పదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి టెర్రస్‌పై పనికిరాని మొక్కలు ఉంటే తొలిగించాలని చెబుతున్నారు.

* ఇక టెర్రస్‌ పై ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిపోయిన ఫర్నిచర్, మంచాలు, కుర్చీలు తదితర వస్తువులను పెట్టకూడదని వీటివల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

* ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ రావాలంటే టెర్రస్‌పై చక్కని గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పూల మొక్కలను ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..