AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zombie Deer Disease: వామ్మో.. వేగంగా వ్యాపిస్తున్న జోంబీ డీర్‌ డిసీజ్‌..! మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా..?

ఈ వ్యాధి అసలు పేరు క్రానిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది సోకిన ప్రతి జంతువును చంపే నాడీ సంబంధిత పరిస్థితి. ఈ వ్యాధి ప్రస్తుతం అమెరికాలో జింకలలో వేగంగా వ్యాపిస్తోంది. జింకలను జాంబీస్‌ల మాదిరిగా చేసే ఈ వ్యాధి చివరికి వాటి ప్రాణాలను తీస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధి మానవులకు వ్యాపిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ తర్వాత మరో ప్రపంచ మహమ్మారి రూపంలో మానవాళి గమనం మరోసారి ఆగిపోతుందా?

Zombie Deer Disease: వామ్మో.. వేగంగా వ్యాపిస్తున్న జోంబీ డీర్‌ డిసీజ్‌..! మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా..?
Zombie Deer Disease
Jyothi Gadda
|

Updated on: Feb 20, 2024 | 7:13 PM

Share

కరోనా మహమ్మారి శాంతించి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇంకా.. అనేక విధాలుగా రూపాంతరం చెందుతున్న వైరస్‌ వ్యాప్తి ప్రజలను టెన్షన్ పెడుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి ఇలా ప్రపంచానికి చుక్కలు చూపెడితే.. ఇప్పుడు మరో వైరస్ మానవాళిని భయపెడుతోంది. అదే ‘జోంబీ డీర్’వైరస్. ప్రస్తుతం జంతువులకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్.. ప్రజలకు సోకడం మొదలైతే మాత్రం మనల్ని మనం రక్షించుకోవడం చాలా కష్టం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే కెనడా శాస్త్రవేత్తలు జోంబీ డీర్ డిసీజ్ అనే ప్రాణాంతక సంక్రమణ వ్యాప్తి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో మనుషులు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి అసలు పేరు క్రానిక్ వేస్టింగ్ డిసీజ్. ఇది సోకిన ప్రతి జంతువును చంపే నాడీ సంబంధిత పరిస్థితి. ఈ వ్యాధి ప్రస్తుతం అమెరికాలో జింకలలో వేగంగా వ్యాపిస్తోంది.

నివేదికల ప్రకారం, బ్రిటిష్ కొలంబియా, కెనడాలో జోంబీ వైరస్‌ వ్యాప్తి పెరగకుండా నిరోధించడానికి ఒక వ్యూహాన్ని జారీ చేసింది. ఈ వ్యాధికి సంబంధించిన రెండు కేసులు జనవరి చివరిలో ఇక్కడ నమోదయ్యాయి. అప్పటి నుంచి ఇక్కడి అధికారులు శరవేగంగా కసరత్తు చేస్తున్నారు. రోడ్డుపై చంపిన ప్రతి జింక, దుప్పి, ఎల్క్ లేదా కారిబోలను పరీక్షించాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

జోంబీ వైరస్‌ మెదడు, ఇతర కణజాలాలలో పేరుకుపోయి శారీరక, ప్రవర్తనా మార్పులు, క్షీణత, చివరికి మరణానికి కారణమవుతుంది. ఇది ఒక జంతువు నుండి మరో జంతువుకు సంపర్కం ద్వారా లేదా పరోక్షంగా మలం, నేల, వృక్షసంపద వంటి పర్యావరణంలో వ్యాపిస్తుంది. జంతువులు వాటి మేత లేదా పచ్చిక బయళ్లను మోసుకెళ్లే ప్రియాన్‌లతో కలుషితమైతే కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. ఒక జింకలో ఈ లక్షణాలు అభివృద్ధి చెందడానికి ఒక సంవత్సరం కాలం పట్టవచ్చు. జింక బరువును తీవ్రంగా కోల్పోవడం, మొత్తం శక్తిని కోల్పోయి చచ్చుబడిపోయినటుంటి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

కెనడియన్ ఆరోగ్య అధికారులు ఈ వ్యాధి మానవులను ప్రభావితం చేస్తుందనడానికి ప్రత్యక్ష ఆధారాలు ఇంకా కనుగొనబడలేదని చెప్పారు.. కానీ, ఒక నివేదిక ప్రకారం, దీనిపై నిర్వహించిన పరిశోధనలో ప్రైమేట్‌ల మధ్య ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని సూచించింది. మానవులు ప్రస్తుతం దీని నుండి సురక్షితంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో వారు దీని బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..