పల్లెటూరి పిల్లలతో పోలిస్తే సిటీ పిల్లలు ఆలస్యంగా మాట్లాడతారు..! ఎందుకు తెలుసా..? తాజా అధ్యయనం..

హార్వర్డ్ యూనివర్సిటీ 12 దేశాలు, 43 భాషల్లో ఈ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పట్టణ, గ్రామీణ పిల్లలు ఇద్దరూ పాల్గొన్నారు. అధ్యయనంలో పాల్గొన్న పిల్లలు రెండు నెలల నుండి నాలుగు సంవత్సరాల వయస్సు గల వారిని ఎంచుకున్నారు. ఆ పిల్లల స్వరాలు వారి అభివృద్ధి దశలో అనేక సార్లు రికార్డ్ చేశారు. 40,000 గంటల అధ్యయనం తర్వాత, పిల్లల భాషా అభ్యాసాన్ని ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయో పరిశోధకులు నివేధికలో వెల్లడించారు.

పల్లెటూరి పిల్లలతో పోలిస్తే సిటీ పిల్లలు ఆలస్యంగా మాట్లాడతారు..! ఎందుకు తెలుసా..? తాజా అధ్యయనం..
Village Baby Urban Babies
Follow us
Jyothi Gadda

| Edited By: TV9 Telugu

Updated on: Feb 20, 2024 | 5:33 PM

పిల్లల ఎదుగుదల గురించి మాట్లాడినట్లయితే.. వారి జీవితంలో మొదటి నాలుగు సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో పిల్లలు మాట్లాడటం నేర్చుకుంటారు. నడవడం ప్రారంభిస్తారు. దీనితో పాటు వారి మేధస్సు అభివృద్ధి కూడా జరుగుతుంది. అయితే, ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. నగరాల్లో నివసించే పిల్లలు ఆలస్యంగా మాట్లాడతారు..దీనితో పోలిస్తే, గ్రామాలలో పిల్లలు త్వరగా మాట్లాడటం ప్రారంభిస్తారని మీకు తెలుసా..? మీరు కూడా నగరంలో నివసిస్తున్నట్టయితే.. మీ పిల్లలు కొంచెం ఆలస్యంగా మాట్లాడటం నేర్చుకుంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు ఆలస్యంగా మాట్లాడతారనే వాస్తవాన్ని ఓ అధ్యయనం వెల్లడించింది.

చాలా మంది పిల్లలు 18 నెలల వయసులో మాట్లాడటం ప్రారంభిస్తారు. రెండు మూడు సంవత్సరాల వయస్సు వచ్చే సరికి వారు పూర్తి వాక్యాలను మాట్లాడటం ప్రారంభిస్తారు. కానీ అందరూ ఒకేలా ఉండరు, ఎందుకంటే ప్రతి పిల్లల ఎదుగుదల భిన్నంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు త్వరగా మాట్లాడటం ప్రారంభిస్తారు. కొంతమంది పిల్లలు నెమ్మదిగా మాట్లాడతారు. ముఖ్యంగా గ్రామాల్లోని పిల్లలతో పోలిస్తే సిటీల్లో పెరిగే పిల్లలు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. ఈ అంశంపై అధ్యయనం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం.

అధ్యయనం ఎలా జరిగింది?: పిల్లల మాటతీరులో ఇంత వ్యత్యాసం ఎలా ఉంటుందని స్టడీ లీడ్ రచయిత ఎలికా బెర్గెల్సన్ వివణ వెల్లడించారు. ఈ అధ్యయనంలో 1001 మంది నాలుగేళ్లలోపు పిల్లలను తీసుకున్నారు. ఈ పిల్లలను నగరాలు, గ్రామాలలో నివసిస్తున్న పిల్లలుగా విభజించారు. వారు పెరిగిన వాతావరణం వారి భాషా అభ్యాసాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం పిల్లలు మాట్లాడే సమయం, స్త్రీ, పురుషులు, వారి పరిసరాలు, బహుళ భాషలను బహిర్గతం చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ అధ్యయనంలో, త్వరగా మాట్లాడటం నేర్చుకునే పిల్లలు, వారి ఇంట్లోని పెద్దల నుండి ఎక్కువగా వింటూ నేర్చుకుంటున్నారని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

పిల్లలు మాట్లాడటం నేర్చుకోవడానికి తల్లిదండ్రుల ఆర్థిక, సామాజిక పరిసరాలు బాధ్యత వహిస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. త్వరగా మాట్లాడటం నేర్చుకునే పిల్లలు చుట్టుపక్కల వ్యక్తులచే ప్రభావితమవుతారని పరిశోధకులు కనుగొన్నారు. మీరు పిల్లలతో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత త్వరగా వాళ్‌లు మాట్లాడటం నేర్చుకోగలరని స్పష్టం చేశారు. పిల్లలు మాట్లాడటం లేదా నేర్చుకునే భాష నగరం, గ్రామానికి సంబంధించినది. నగరాల్లో పిల్లలకు మాట్లాడే అవకాశం తక్కువ. కానీ, గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా పిల్లల చుట్టూ ఉంటారు. పిల్లలు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలను వింటూ వెంటనే నేర్చుకుంటారు. తద్వారా వారు త్వరగా మాట్లాడటం అలవాటు చేసుకుంటారని తేల్చారు.

హార్వర్డ్ యూనివర్సిటీ 12 దేశాలు, 43 భాషల్లో ఈ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పట్టణ, గ్రామీణ పిల్లలు ఇద్దరూ పాల్గొన్నారు. అధ్యయనంలో పాల్గొన్న పిల్లలు రెండు నెలల నుండి నాలుగు సంవత్సరాల వయస్సు గల వారిని ఎంచుకున్నారు. ఆ పిల్లల స్వరాలు వారి అభివృద్ధి దశలో అనేక సార్లు రికార్డ్ చేశారు. 40,000 గంటల అధ్యయనం తర్వాత, పిల్లల భాషా అభ్యాసాన్ని ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయో పరిశోధకులు నివేధికలో వెల్లడించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..