AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits Of Red Banana : ఎర్ర అరటిపండుతో ఎన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చో తెలుసా ? ఈ వేసవిలో తప్పనిసరిగా..

మీరు చాలా కాలంగా బరువు తగ్గడానికి కష్టపడుతున్నట్లయితే, మీ ఆహారంలో రెడ్ బనానా చేర్చుకోండి. ఒక పండులో 90 కేలరీలు ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ మొత్తంలో జ్యూస్ తీసుకోవటంతోనే ఇది మీ కడుపు నింపుతుంది.. దీంతో మీరు ఎక్కువ జంక్ ఫుడ్ తినకుండా ఉంటారు.

Benefits Of Red Banana : ఎర్ర అరటిపండుతో ఎన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చో తెలుసా ? ఈ వేసవిలో తప్పనిసరిగా..
Red Banana
Jyothi Gadda
|

Updated on: Feb 20, 2024 | 3:30 PM

Share

మనలో చాలా మందికి ఎర్రటి అరటిపండు గురించి ఎక్కువగా తెలియదు. మనం ఎక్కువగా పసుపు అరటి పండ్లను మాత్రమే చూస్తుంటాం. కానీ ఎర్ర అరటి పండు కొన్ని చోట్ల మాత్రమే అమ్ముతుంటారు. అయితే, ఎర్ర అరటిపండ్లు సాధారణ అరటిపండ్ల కంటే కొంచెం ఖరీదైనవి. కానీ, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోజూ తినలేకపోయినప్పటికీ మీరు ఖచ్చితంగా వారానికి ఒకటి లేదా రెండుసార్లు రెడ్‌ బనానా జ్యూస్ తీసుకోవటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎర్ర బనానా యథాతథంగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వేసవిలో దీని జ్యూస్ తాగటం వల్ల మరిన్ని లాభాలు కలుగుతాయంటున్నారు. ఈ జ్యూస్‌ రుచి అద్భుతంగా ఉండడంతో పాటు శరీరానికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే, రెడ్‌ బనానా జ్యూస్‌ని దుకాణాల్లో కొనటం కంటే..మీరు సొంతంగా తయారు చేయడం మంచిదని చెబుతున్నారు. చక్కెర కలపకుండా తాగడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుంది. ఎర్రటి బనానా జ్యూస్‌ తాగడం వల్ల కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ అరటి తొక్క ఎరుపు రంగులో ఉంటుంది.. కానీ లోపల గుజ్జు సాధారణ అరటిపండు లాగానే ఉంటుంది. ఇది ఎక్కువగా ఆగ్నేయాసియాలో పండుతుంది. ఇది మన అనారోగ్య సమస్యలన్నింటికి చెక్ పెడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్‌ రోగులకు చక్కగా పని చేస్తుంది. ఈ పండు కంటి చూపును కూడా మెరుగుపరస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

సహజ చక్కెరలు: ఎర్ర బనానాలో ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి మిమ్మల్నీ రోజంతా చురుగ్గా ఉంచేందుకు సహాకరిస్తాయి. అందువల్ల, మీరు జిమ్‌లో మంచి వ్యాయామం చేయవలసి వస్తే, మీరు ముందుగానే ఇలాంటి ఎర్ర బనానా జ్యూస్ తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

డిప్రెషన్‌ను నివారిస్తుంది: అరటిపండులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది ట్రిప్టోఫాన్‌ను సెరోటోనిన్‌గా మారుస్తుంది. సెరోటోనిన్ మిమ్మల్ని సంతోషంగా ఉంచడంలో సహాయపడే అనుభూతిని కలిగించే హార్మోన్. కాబట్టి, ఈ జ్యూస్‌ తాగడం వల్ల మీరు ప్రారంభంలోనే డిప్రెషన్‌ను అధిగమించవచ్చు.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: మీరు చాలా కాలంగా బరువు తగ్గడానికి కష్టపడుతున్నట్లయితే, మీ ఆహారంలో రెడ్ బనానా చేర్చుకోండి. ఒక పండులో 90 కేలరీలు ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ మొత్తంలో జ్యూస్ తీసుకోవటంతోనే ఇది మీ కడుపు నింపుతుంది.. దీంతో మీరు ఎక్కువ జంక్ ఫుడ్ తినకుండా ఉంటారు.

గుండెకు మంచిది: నారింజలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది సోడియం ఉప్పు ప్రభావాలను వ్యతిరేకిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. అందువలన, ఇది ఛాతీ నొప్పి, స్ట్రోక్, ఇతర గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

గుండెల్లో మంట: ఈ ఎర్రటి అరటి పండు ఎసిడిటీని దూరం చేస్తుంది. ఇది కడుపు నొప్పితో పాటు గుండెల్లో మంటను నయం చేస్తుంది. కాబట్టి, మీకు కడుపునొప్పి, గుండెల్లో మంట ఉన్నప్పుడు, రెడ్‌ బనానా జ్యూస్‌ తాగటం చాలా మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..