AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్రికెట్‌ మైదానంలోకి పరిగెత్తిన ఎద్దు.. ఆపకుండా రన్స్‌ తీసిన ఫీల్డర్లు..! చివరకు ఏమైందో చూడాల్సిందే..

ఇకపోతే, ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియనప్పటికీ, దీనిని చూస్తుంటే ఏదో ఒక గ్రామం లేదంటే ఏదో ఒక పట్టణంలో స్థానిక క్రికెట్ పోటీ నిర్వహించబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎద్దు ఒక్కసారిగా క్రికెట్‌ మైదానంలోకి ప్రవేశించింది. అక్కడ చాలా మంది జనాలు కూడా రోడ్డుపై కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు..

Viral Video: క్రికెట్‌ మైదానంలోకి పరిగెత్తిన ఎద్దు.. ఆపకుండా రన్స్‌ తీసిన ఫీల్డర్లు..! చివరకు ఏమైందో చూడాల్సిందే..
Bull enters in cricket ground
Jyothi Gadda
|

Updated on: Feb 19, 2024 | 9:40 PM

Share

క్రికెట్ గ్రౌండ్‌లో ప్రేయర్స్‌ అందరూ ఎంతో ఆసక్తిగా ఆడుతున్నారు.. కానీ, అంతలోనే ఊహించని పరిణమం ఎదురైంది. క్రికెట్‌ గ్రౌండ్‌కు సంబంధించిన ఈ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటున్నారు. ఇక్కడ ఒక క్రికెట్ మైదానంలోకి ఎద్దు ప్రవేశించింది. ఇది చూసిన క్రీడాకారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఒక ఎద్దు అకస్మాత్తుగా క్రికెట్ గ్రౌండ్‌లోకి ప్రవేశించడంతో ఆటగాళ్లంతా పరిగెత్తడం మొదలు పెట్టారు. ఈ దృశ్యం చూసి అక్కడ కూర్చున్న ప్రేక్షకులు కూడా నవ్వుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు. ఇంతలో అకస్మాత్తుగా రెండు ఎద్దులు అక్కడికి ప్రవేశించాయి. ఎద్దులలో ఒకటి మైదానం మధ్యలోకి వెళ్లేందుకు పరిగెత్తింది. దాంతో ఒక్కసారిగా అక్కడ సందడి నెలకొంది. ఎద్దును తప్పించేందుకు ఫీల్డర్లు కూడా పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత భయంతో ఎద్దు కూడా పారిపోతుంది. అలా క్షణాల్లోనే అక్కడ మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది. వీడియో వైరల్‌ కావటంతో సోషల్ మీడియా యూజర్లు ఫన్నీ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఎద్దు భయానికి గ్రౌండ్‌లో ఉన్న వారంతా పరుగులు తీశారు. అక్కడ ఒక్క బ్యాట్స్‌మెన్ మాత్రమే మిగిలాడు. అతని చేతిలో బ్యాట్ ఉంది. ఇక ఆ తర్వాత ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టకుండా ఆ ఎద్దు గ్రౌండ్‌లోంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వైరల్ వీడియోపై అనేక స్పందనలు వెలువడుతున్నాయి. ఒక వినియోగదారు బ్యాట్స్‌మెన్ ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు ఎద్దు క్రికెట్ ఆడాలని కోరుకుంటుందని, తనను ఎవరూ ఆపలేరంటూ ఒక వినియోగదారు ఫన్నీగా స్పందించారు.

ఇకపోతే, ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియనప్పటికీ, దీనిని చూస్తుంటే ఏదో ఒక గ్రామం లేదంటే ఏదో ఒక పట్టణంలో స్థానిక క్రికెట్ పోటీ నిర్వహించబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎద్దు ఒక్కసారిగా క్రికెట్‌ మైదానంలోకి ప్రవేశించింది. అక్కడ చాలా మంది జనాలు కూడా రోడ్డుపై కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు.. పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా పాములు, విష జంతువుల వీడియోలు కూడా బయటకు రావడం గమనార్హం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..