Viral News: జూలో మొసలికి అస్వస్థత.. స్కాన్‌ చేసిన వైద్యులకు షాకింగ్‌ సీన్‌ కనిపించింది.. సర్జరీ తర్వాత..

36 ఏళ్ల మొసలి ఉన్నట్టుండి తిండి తినడం మానేసింది. దాంతో జూ సిబ్బంది మొసలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, స్కానింగ్‌ రిపోర్ట్‌లో షాకింగ్ సీన్ కనిపించింది. అది చూసిన వైద్యులు సైతం అవాక్కయ్యారు. వెంటనే మొసలికి శస్త్రచికిత్స నిర్వహించారు. గంటల పాటు శ్రమించిన పశువైద్యులు.. ఎట్టకేలకు మొసలి కడుపులో పేరుకుపోయిన ..

Viral News: జూలో మొసలికి అస్వస్థత.. స్కాన్‌ చేసిన వైద్యులకు షాకింగ్‌ సీన్‌ కనిపించింది.. సర్జరీ తర్వాత..
Crocodile
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 20, 2024 | 4:59 PM

జూలో 36 ఏళ్ల మొసలి కడుపులో 70కి పైగా నాణేలు లభ్యమయ్యాయి. ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన జూ అధికారులు, పశువైద్యులు జంతువులను ఉంచే ప్రదేశంలో నాణేలను విసిరేయవద్దని ప్రజలను అభ్యర్థించారు. అమెరికాలోని ఒమాహాలోని హెన్రీ డోర్లీ జూ అండ్ అక్వేరియంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిబోడాక్స్ అనే 36 ఏళ్ల మొసలి ఉన్నట్టుండి తిండి తినడం మానేసింది. దాంతో జూ సిబ్బంది మొసలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, స్కానింగ్‌ రిపోర్ట్‌లో మొసలి కడుపులో నాణేలు కనిపించాయి. వెంటనే మొసలికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు..మొసలి కడుపులోంచి 70 నాణేలు తొలగించారు. దాంతో ఆ మొసలి ప్రాణాలను రక్షించారు.

దీని గురించి హెన్రీ డోర్లీ జూలోని వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ..ఇక్కడ జూకి వచ్చే సందర్శకులు మొసలి ఉన్న చోట నాణేలను విసిరేస్తారని చెప్పారు. ఇది చాలా ప్రమాదకరమైన పద్దతి అని చెప్పారు. ఇలా చేయటం వల్ల జంతువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తినడం మానేసిన థిబోడాక్స్‌కు మత్తుమందు ఇచ్చి పరీక్షించగా శరీరం లోపల నాణేలు ఉన్నట్లు తేలిందని వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి
Crocodile

పొట్టలోకి ప్లాస్టిక్ పైపు ద్వారా కెమెరాను పంపి చెక్‌ చేశారు. తరువాత నాణేలను విజయవంతంగా వెలికితీశారు. శస్త్రచికిత్స తర్వాత థియోడాక్స్ కోలుకుంది. అనంతరం దాని నివాసస్థలంలో తిరిగి విడిచిపెట్టినట్టుగా వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటన తర్వాత జూ వద్దకు వచ్చే వ్యక్తులు జూలోని ఫౌంటైన్‌లలో నాణేలను విసిరేయవద్దనే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..