AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dates Effects: రోజూ ఖర్జూర పండ్లను తినవచ్చా.. తింటే ఏం జరుగుతుంది?

డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరాలు కూడా ఒకటి. ఖర్జూరంలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. మనిషి శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు, మినరల్స్ ఖర్జనూరంలో లభిస్తాయి. ప్రతి రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు. ముఖ్యంగా బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఖర్జూరాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పచ్చివి. రెండోది ఎండిన ఖర్జూరాలు. ఎండిన ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే ఇంకా ఎన్నో..

Dates Effects: రోజూ ఖర్జూర పండ్లను తినవచ్చా.. తింటే ఏం జరుగుతుంది?
Dates
Chinni Enni
|

Updated on: Feb 20, 2024 | 4:27 PM

Share

డ్రై ఫ్రూట్స్‌లో ఖర్జూరాలు కూడా ఒకటి. ఖర్జూరంలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. మనిషి శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు, మినరల్స్ ఖర్జనూరంలో లభిస్తాయి. ప్రతి రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు. ముఖ్యంగా బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఖర్జూరాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పచ్చివి. రెండోది ఎండిన ఖర్జూరాలు. ఎండిన ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరాలతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా చర్మం, జట్టు సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఇవి కేవలం సీజనల్ వారీగానే లభ్యమవుతాయి. కానీ వీటిని ప్రిజర్వేట్ చేసి అన్ని కాలాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖర్జూరాలను రోజూ తినొచ్చా.. తింటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

రక్త హీనత కంట్రోల్:

రోజూ రెండు ఖర్జూరాలను తినడం వల్ల రక్త హీనత సమస్య అదుపులోకి వస్తుంది. ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్, విటమిన్ సి మెండుగా లభ్యమవుతాయి కాబట్టి.. వీటిని తింటే రక్త హీనత లోపం నుంచి బయట పడొచ్చు. నానబెట్టిన ఖర్జూరాలైనా తినొచ్చు.

రక్త పోటు అదుపులో ఉంటుంది:

అధిక రక్త పోటు.. గుండె పోటు, జబ్బులకు కారణం అవుతుంది. ఖర్జూరాల్లో మెగ్నీషియం, పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్త పోటును నియంత్రించడానికి బాగా సహాయ పడుతుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి:

ఖర్జూరాల్లో ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం లభిస్తాయి కనుక.. వీటిని తింటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. అంతే కాకుండా ఎముకలకు వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి.

బ్రెయిన్ హెల్దీ:

ఖర్జూరాల్లో మెగ్నీషియం, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడులోని ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అదే విధంగా తెలివి తేటలను కూడా పెంచుతాయి. ఖర్జూరాలు తింటే బ్రెయిన్ యాక్టీవ్‌గా ఉంటుంది. పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది.

చర్మం, జుట్టు ఆరోగ్యం:

ప్రతి రోజూ ఖర్జూరాలను తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టు రాలకుండా, చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌